ETV Bharat / bharat

చంద్రయాన్​-2: 'విక్రమ్'​ ఆచూకీ కనిపెట్టిన ఆర్బిటర్​

చంద్రయాన్​-2లోని విక్రమ్​ ల్యాండర్​ జాడ తెలిసిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్​ కె. శివన్​ వెల్లడించారు. ల్యాండర్​ చంద్రుని ఉపరితలాన్ని బలంగా ఢీ కొట్టి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు.

చంద్రయాన్​-2: 'విక్రమ్'​ ఆచూకీ కనిపెట్టిన ఆర్బిటర్​
author img

By

Published : Sep 8, 2019, 4:49 PM IST

Updated : Sep 29, 2019, 9:45 PM IST

చంద్రయాన్​-2: 'విక్రమ్'​ ఆచూకీ కనిపెట్టిన ఆర్బిటర్​

భారత బాహుబలి ప్రాజెక్ట్​ చంద్రయాన్​-2కు సంబంధించి ఓ శుభవార్త తెలిసింది. చంద్రుని ఉపరితలంపై ఉన్న విక్రమ్​ ల్యాండర్​ ఆచూకీ తెలిసినట్లు ఇస్రో ఛైర్మన్​ కె. శివన్​ తెలిపారు. అయితే తాము ప్రయత్నించినట్టు ల్యాండర్...​ జాబిల్లిపై మృదువుగా దిగి ఉండకపోవచ్చన్నారు.

"చంద్రుని ఉపరితలంపై ఉన్న విక్రమ్​ ల్యాండర్​ ఆచూకీ కనుక్కోగలిగాం. ల్యాండర్​ థర్మల్​ చిత్రాన్ని ఆర్బిటర్​ తీసింది. అయితే ప్రస్తుతం ల్యాండర్​తో సంబంధాలు లేవు. సమాచార వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాము. త్వరలోనే ఇది పూర్తవుతుంది." - కె. శివన్, ఇస్రో ఛైర్మన్

రోవర్​ ప్రజ్ఞాన్​.. ల్యాండర్​లోనే ఉన్నట్లు చంద్రయాన్​-2 ఆర్బిటర్​లోని కెమెరాల్లో నిక్షిప్తమైందన్నారు శివన్​. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్​ బలంగా దిగి ఉంటే.. ఏమైనా హాని కలిగి ఉంటుందా? అన్న ప్రశ్నకు మాత్రం.. ఇంకా ఆ వివరాలు తెలియలేదని బదులిచ్చారు.

చంద్రయాన్‌-2 సాఫ్ట్‌ ల్యాండింగ్‌లో భాగంగా చివరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తింది. ల్యాండర్‌ విక్రమ్‌ నుంచి ఇస్రో కేంద్రానికి సంకేతాలు నిలిచిపోయాయి. ఈ పరిణామంతో యావత్‌ భారతావని నిరాశ చెందిన సమయంలో ల్యాండర్‌ ఆచూకీ లభించడం ఊరట కలిగించింది.

అదే ధైర్యాన్నిచ్చింది...

ల్యాండర్​ విక్రమ్​ ఆచూకీ తెలియని సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ, దేశ ప్రజలు ఇస్రో శాస్త్రవేత్తలపై ఉంచిన నమ్మకం కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని శివన్​ పేర్కొన్నారు.

ప్రధాని మోదీ, దేశ ప్రజలు.. మా వెంట ఉండటం ఎప్పటికీ మర్చిపోలేం. ప్రధాని తన మాటలతో మాలో ఉత్సాహం, ప్రేరణ, ధైర్యం నింపారు. ఆనాడు ఆయన మాట్లాడిన విధానం.. మా మనసులకు బాధ నుంచి కాస్త ఊరట కలిగించింది. ఇంతకంటే ప్రధాని, దేశం నుంచి మేం ఏం కోరుకోగలం.
- కె. శివన్​, ఇస్రో ఛైర్మన్

అది కోట్లమంది ఊరట...

విక్రమ్​ ల్యాండర్​తో సంబంధాలు తెగిపోయిన అనంతరం శివన్​ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో శివన్​ను మోదీ హత్తుకుని.. ఓదార్చిన వీడియో అంతర్జాలంలో విపరీతంగా వైరల్​ అయింది. అది కేవలం ప్రధాని ఒక్కరి ఓదార్పు కాదని.. దేశం మొత్తానిది అంటూ నెటిజన్లు ఇస్రోకు మద్దతు పలికారు.

Rohtak (Haryana), Sep 08 (ANI): Prime Minister Narendra Modi on Sep 08 said that Chandrayaan-2 has tied the entire country together. He said, "At 1:50 AM on September 8, entire nation was sitting in front of TV, looking at Chandrayaan mission. In those 100 second, I witnessed how an incident awakened the entire country and tied the country together. Like we talk about sportsman spirit, it's ISRO spirit in Hindustan now."
Last Updated : Sep 29, 2019, 9:45 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.