ETV Bharat / bharat

ఆర్జేడీ అధినేత లాలూకు అస్వస్థత - లాలూ న్యూస్​

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు రిమ్స్​ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు సమాచారం.

lalu yadav health update lalu prasad yadav having trouble in breathing
ఆర్జేడీ అధినేత లాలూకు అస్వస్తత
author img

By

Published : Jan 21, 2021, 10:03 PM IST

Updated : Jan 21, 2021, 10:23 PM IST

బిహార్​ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే రాంచీ రిమ్స్​ ఆసుపత్రిలో ఉన్న ఆయనకు ఆకస్మికంగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనట్లు తెలుస్తోంది.

లాలూ ఊపిరితిత్తుల్లో ఇన్​ఫెక్షన్​ను గుర్తించినట్టు వైదులు వెల్లడించారు. ఇది ఓ రకమైన న్యుమోనియా అని పేర్కొన్నారు. ప్రస్తుతం చికిత్స చేస్తున్నట్టు.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వివరించారు.

అయితే లాలూకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ర్యాపిడ్​ యాంటిజెన్​ పరీక్షలో కొవిడ్​ నెగిటివ్​గా తేలగా.. ఆర్​టీ-పీసీఆర్​ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్టు స్పష్టం చేశారు వైద్యులు.

మరోవైపు జైలు సూపరిండెంట్​, ఇతర అధికారులు ఝార్ఖండ్‌లోని రాజేంద్ర ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి చేరుకున్నారు.

పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ.. ఈ మధ్యకాలంలో పలు సందర్భాల్లో తీవ్ర ఆనారోగ్యానికి గురయ్యారు.

ఇదీ చూడండి: 'సాగు చట్టాల్ని రద్దు చేయాల్సిందే.. మరో మాట లేదు'

Last Updated : Jan 21, 2021, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.