ETV Bharat / bharat

లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. నియామకాల్లో నిర్లిప్తత

దేశంలో ఏటా నిరుద్యోగ సమస్య పెరుగుతూనే ఉంది. తాజాగా వివిధ మంత్రిత్వ శాఖల్లో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ఉద్యోగ ఖాళీలు పెరుగుతున్నా, అందుకు తగిన అర్హత కలిగిన నిరుద్యోగులున్నప్పటికీ.. నియామకాల ప్రక్రియ సజావుగా సాగడం లేదని నిపుణులు పేర్కొన్నారు. ఇందుకు ప్రధాన కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని చెబుతున్నారు.

lacks of jobs are available at country.. but there is no recruitment because of government negligancy said experts
లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా... నియాకాల్లో వైఫల్యం
author img

By

Published : Feb 7, 2020, 7:42 AM IST

Updated : Feb 29, 2020, 11:54 AM IST

దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో 6.83 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్‌సభలో నిగ్గు తేల్చింది. ఉద్యోగాల భర్తీలో ఏళ్లుగా కొనసాగుతున్న నిర్లక్ష్య ధోరణికి ఇది నిదర్శనం. కేంద్రంతోపాటు రాష్ట్రాల్లోనూ ఉద్యోగ ఖాళీలు పెద్దయెత్తున ఉన్నా- వాటికి అన్నివిధాలా అర్హులైన నిరుద్యోగులున్నా, నియామకాల ప్రక్రియ సజావుగా సాగడం లేదు. ప్రభుత్వాల విధాన వైఫల్యాలే ఇందుకు కారణం. ఇది ప్రభుత్వ పరిపాలన, ప్రజాసేవలతోపాటు యువత అవకాశాలపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. దేశవ్యాప్తంగా ఏటా 40 లక్షల మంది నిరుద్యోగులు పెరుగుతున్నారు. దేశంలో 997 ప్రభుత్వ ఉపాధి కల్పన కార్యాలయాల్లో నమోదైన నిరుద్యోగుల సంఖ్య 5.2 కోట్లుగా ఉంది. నమోదుకాని వారి సంఖ్య మరో ఏడు కోట్లకు పైగా ఉంటుందని అంచనా. జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌వో) తాజాగా నిర్వహించిన సర్వే నివేదికలను రహస్యంగా ఉంచారు. నిరుద్యోగిత తీవ్రరూపం దాలుస్తోందని సదరు నివేదిక పేర్కొన్న సమాచారం బయటకొచ్చింది. ప్రైవేటుతోపాటు ప్రభుత్వ రంగంలోనూ ఉద్యోగాలు పొందలేని పరిస్థితులు నెలకొదేశంలోని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మంజూరైన ఉద్యోగాల సంఖ్య 38,02,779 కాగా, 2018 మార్చి నాటికి 31,18,956 మంది ఉద్యోగులున్నారు. 6,83,823 కొలువులు ఖాళీగా ఉన్నాయి. గడచిన ఏడాదిన్నరలో పదవీ విరమణలు, మరణాలు, పదోన్నతులు, రాజీనామాలు తదితర కారణాలతో మరో లక్షన్నరదాకా ఖాళీలు ఏర్పడ్డాయి.

వీటిలో రైల్వే శాఖకు చెందినవే 1,16,391 ఉద్యోగాలున్నాయి. దేశంలో ప్రధాన రవాణా వ్యవస్థగా ఉన్న రైల్వేల్లో భారీ సంఖ్యలో ఖాళీలు ఉండటంతో సేవలపై ప్రభావం పడుతోంది. కీలకమైన రక్షణ శాఖలోనూ నియామకాలు సరిగా లేవు. ఆర్మీలో 6,867 అధికారుల ఉద్యోగాలు, నౌకాదళంలో 1,500 ఉద్యోగాలు, వైమానిక దళంలో 425 అధికారుల ఉద్యోగాలు భర్తీ కావాల్సి ఉంది. ఆర్మీలో 36,517 జూనియర్‌ అధికారులు, నౌకాదళంలో 15,590 నావికుల ఉద్యోగాలు, వైమానిక రంగంలో 10,425 ఎయిర్‌మెన్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 48 కేంద్ర విశ్వవిద్యాలయాలలో అయిదు వేలకుపైగా ఖాళీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లోనూ ఉద్యోగాలు ఏటా 22 వేల చొప్పున తగ్గుతున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ ఖాళీల సంఖ్య భారీగానే ఉంది. 2019 వరకు రాష్ట్రాల్లో ఖాళీలు 16 లక్షలు. యూపీ వంటి పెద్ద రాష్ట్రాలతోపాటు నాగాలాండ్‌ వంటి చిన్న రాష్ట్రాల్లోనూ ఖాళీలు వేల సంఖ్యలో ఉన్నాయి. అత్యవసర విభాగాల్లోనూ ఖాళీలు కొనసాగుతున్నాయి. దిల్లీలోని కేంద్ర కేబినెట్‌ సచివాలయం, ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో దస్త్రాలు, సేవలు తీవ్ర ఆలస్యం కావడానికి వాటిలో సరిపడా ఉద్యోగులు లేకపోవడమే ప్రధాన కారణంగా గుర్తించారు. రాష్ట్రాల్లోనూ పాలన సమస్యలు దీనివల్లే ఉత్పన్నమవుతున్నాయి. బ్యాంకుల విలీనం వల్ల భవిష్యత్తు నియామకాలు ప్రశ్నార్థకంగా మారాయి.

ఆర్థిక పరిస్థితిలో లంకె..

ప్రస్తుతం ఉద్యోగాల భర్తీకి కేంద్రంలో, రాష్ట్రాల్లో ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. వాస్తవానికి ఉద్యోగ నియామకాలు అనివార్యమయినవి. పొదుపుతో, ఆర్థిక నియంత్రణలతో సంబంధం లేనివి. వాటిని కుదించాల్సిన అవసరం లేదు. నియామకాలను కొనసాగిస్తూ శాఖాపరమైన అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. పాలన సంస్కరణలు, సమీక్షలు వంటి వాటి ద్వారా ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించుకోవచ్చు. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలు సాగడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపు, సౌకర్యాల కల్పనకు కేంద్రంలో పే కమిషన్‌, రాష్ట్రాల్లో వేతన సవరణ కమిషన్లు ఉన్నాయి. ఉద్యోగాల అవసరాలు, ఇతర అంశాలను ఈ కమిషన్లు ప్రస్తావించకుండా వేతన సవరణకు పూనుకోవడం వల్ల నియామకాలు సజావుగా జరగడం లేదు. నియామకాల ప్రక్రియ క్రమం తప్పకుండా జరగాల్సి ఉన్నా ఏళ్ల తరబడి జాప్యం నెలకొంటోంది. ప్రతి శాఖలో ఆరు నుంచి ఎనిమిదేళ్లపాటు నియామకాలు ఆగిపోతున్నాయి. ఉద్యోగాల భర్తీకి ఇప్పటిదాకా కేంద్రంలోగానీ, రాష్ట్రంలోగానీ స్పష్టమైన విధానం లేదు. నియామకాలు కేంద్రీకృతంగా లేవు. కేంద్ర, రాష్ట్రాల స్థాయుల్లో వేర్వేరు సంస్థలు చేపడుతున్నాయి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించే పనులు సక్రమంగా సాగడం లేదు. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక శాఖలు బడ్జెట్‌ ప్రవేశపెట్టే సందర్భాల్లో ఇతర శాఖల నుంచి వివరాల్ని సేకరిస్తున్నాయి. కార్మిక శాఖ పరిధిలో ఉపాధి కల్పన కార్యాలయాలు పని చేస్తున్నాయి. వాటిల్లో నిరుద్యోగుల నమోదు మాత్రమే జరుగుతోంది. ఉద్యోగాలు ఇప్పించే బాధ్యతలను తీసుకోవడం లేదు. వాటివద్ద ఉండే సమాచారాన్ని ప్రభుత్వ శాఖలు పరిగణనలోనికి తీసుకోవడం లేదు.

విదేశాల్లో ఎలా ఉంది?

అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఆరు నెలలకు ముందే ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఖాళీలను గుర్తించి, భర్తీ చేసే ప్రక్రియ సాగుతోంది. ఖాళీల భర్తీకి ప్రత్యేక వ్యవస్థలున్నాయి. ప్రతీ నెలా నియామకాల సమీక్ష జరుగుతుంది. అన్ని వర్గాలకు సమాన అవకాశాలను కల్పిస్తున్నారు. ఏ ఉద్యోగ నియామకమైనా ఆరు నెలల్లోపే భర్తీ చేయాలనే నిబంధన ఉంది. ఉద్యోగ ఖాళీలపై ప్రసారమాధ్యమాలు, వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. మౌఖిక పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. మన దేశంలో ఇలాంటి పద్ధతి లేదు. ఉద్యోగ నియామకాలను ఎక్కువగా ఎన్నికల సమయంలోనే ప్రకటిస్తున్నారు. కేంద్రంలో యూపీఎస్సీ నియామకాలు పరిమితంగా ఉంటున్నాయి. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఎంపిక సుదీర్ఘ కాలం సాగుతోంది. రైల్వే నియామకాలు ఇష్టారాజ్యంగా ఉన్నాయి. రాష్ట్రాల్లో పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ నియామకాలు ఎప్పుడో ఒకసారి ఉంటున్నాయి. యూపీఎస్సీకి, రాష్ట్రాల్లోని పీఎస్సీలకు, ప్రభుత్వ శాఖలకు మధ్య సమన్వయం ఉండటం లేదు. ఉద్యోగాలకు అర్హతల ఖరారు ప్రక్రియల్లోనే సమస్యలు తలెత్తుతున్నాయి. దరఖాస్తుల విధానంలోనూ లోపాలు ఉంటున్నాయి. పరిశీలన ప్రక్రియ నెలలకొద్దీ సాగుతోంది. ప్రశ్నపత్రాల లీకేజీలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. తుది జాబితాల ఖరారులోనూ ఇక్కట్లు తప్పడం లేదు. రిజర్వేషన్లకు తోచిన రకంగా భాష్యం చెబుతూ ఎంపిక చేస్తున్నారు. రోస్టర్‌ విధానం నిక్కచ్చిగా అమలు కావడం లేదు.

ఉద్యోగ పత్రాల కోసమూ నిరీక్షించాల్సి వస్తోంది. నియామక ప్రక్రియలో లోపాలు, చిన్నపాటి కారణాలతో న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలవుతున్నాయి. సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వాలు కృషి చేయడం లేదు. నియామకాల ప్రక్రియకు బదులు తాత్కాలికంగా ఒప్పంద, పొరుగు సేవల విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. ఈ విధానాల ద్వారా నియమితులై దేశవ్యాప్తంగా తొమ్మిది లక్షల మంది పని చేస్తున్నారు. చాలామంది కీలక బాధ్యతల్లో ఉన్నారు. శాశ్వత ఉద్యోగులకు దీటుగా పని చేస్తున్నారు. ఇందులో కొంతమంది సాధారణ నియామక విధానం కింద చేరినా- వారిని ప్రభుత్వాలు క్రమబద్దీకరించడం లేదు. పొరుగుసేవల వారి పరిస్థితి మరీ దయనీయం. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు లాభాలు పొందుతూ, ఉద్యోగులకు అరకొర వేతనాలిస్తున్నాయి. వారి ఇక్కట్లను ప్రభుత్వాలూ పట్టించుకోవడం లేదు.

ప్రత్యేక శాఖ అవసరం..

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దేశంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల పంథా మారాలి. నియామకాలపై ప్రత్యేక విధానం రావాలి. ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. అన్ని నియామక సంస్థలను దాని పరిధిలోకి తేవాలి. ఖాళీల భర్తీకి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి. అమలుకు పటిష్ఠ యంత్రాంగం ఉండాలి. ఆరు నెలల వ్యవధిలో నియామక ప్రక్రియ పూర్తి కావాలి. సత్వరమే అన్ని ఉద్యోగ ఖాళీలను గుర్తించి, యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు కృషిచేయాలి. తాజాగా కేంద్ర ప్రభుత్వం నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాల భర్తీకి జాతీయ నియామక సంస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం స్వాగతించదగిన పరిణామం. ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణకు అన్ని జిల్లాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయడం అభ్యర్థులకు సౌలభ్యం కలిగించే నిర్ణయం. ప్రస్తుతం యువత వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు రాయడానికి ఇబ్బందులు పడుతున్నారు. నియామక ప్రక్రియను సులభతరం చేయాలి. అవసరమయితే ప్రభుత్వాలు సేవా నిబంధనలను మార్చాలి. రోస్టర్‌, రిజర్వేషన్‌ విధానం పక్కాగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగుల కేటగిరీలోని బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలి. ఏటా పొడిగింపు విధానం సరికాదు. ఉద్యోగ నియామకాల పరీక్షల నిర్వహణలో పకడ్బందీ జాగ్రత్తలు తీసుకోవాలి. అక్రమాలకు ఏ మాత్రం ఆస్కారం ఇవ్వరాదు. ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టాలి. మౌఖిక పరీక్షలను నిష్పాక్షికంగా, నిక్కచ్చిగా జరపాలి. రాజకీయ, అధికారిక ఒత్తిళ్లకు తలొగ్గరాదు. ఉద్యోగ నియామక ప్రక్రియలో దళారుల అరాచకాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకు పట్టణాలతోపాటు నగరాల నుంచి అభ్యర్థులు ఎంపికయ్యేందుకు వీలుగా వారికి ప్రభుత్వాల తరఫున శిక్షణ ఇవ్వాలి. ఇందుకు ప్రైవేటు సంస్థల సాయం తీసుకోవాలి. ఆర్మీ, పోలీసు నియామకాలకు ఇప్పుడు కొన్ని జిల్లాల్లో ఈ సౌకర్యం ఉంది. మరోవైపు రైల్వేలు, ఇతర సంస్థల్లో, శాఖల్లో ఉద్యోగాలకు విస్తృతంగా శిక్షణ సౌకర్యాలు లేవు. రాష్ట్రాల్లో స్టడీ సర్కిళ్లు ప్రారంభమైనా అవి పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధి కల్పన కార్యాలయాలు క్రియాశీలకంగా మారితేనే ప్రయోజనకరం.

తెలుగు రాష్ట్రాల్లో..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రభుత్వ శాఖల్లో భారీయెత్తున ఖాళీలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం లక్ష ఉద్యోగాల భర్తీకి పూనుకోగా- ఆ ప్రక్రియ ఇంకా సాగుతోంది. ఎప్పటికప్పుడు ఖాళీల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రభుత్వ శాఖల్లో నియామకాలు పూర్తిస్థాయిలో లేవు. పబ్లిక్‌ సర్వీసు కమిషన్ల ద్వారా నియామక ప్రక్రియలో మరింత వేగం అవసరం.

-ఆకారపు మల్లేశం

ZCZC
PRI GEN LGL NAT
.NEWDELHI LGD37
DL-COURT-SHARJEEL
Delhi court sends Sharjeel Imam to judicial custody for 6 days
         New Delhi, Feb 6 (PTI) A Delhi court Thursday sent Sharjeel Imam, arrested on sedition charges, to judicial custody for six days, his lawyer said.
         Imam was produced at the residence of Chief Metropolitan Magistrate Purushottam Pathak in the evening amidst high security, said the lawyer, appearing for the Jawaharlal Nehru University (JNU) research scholar.
         Imam was arrested from Bihar's Jehanabad on January 28 for allegedly making inflammatory speeches at the Jamia Millia Islamia University here and in Aligarh.
         He was brought to Delhi the next day.
         The court had earlier sent Imam to 3-day police custody. PTI URD
SA
02062056
NNNN
Last Updated : Feb 29, 2020, 11:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.