కరోనా లాక్డౌన్ వేళ సొంతగ్రామాలకు వెళ్లేందుకు ప్రయాసలు పడుతున్నారు వలసకార్మికులు. వీలైన మార్గం ద్వారా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఇంటికి వెళ్తే 14 రోజుల పాటు నిర్బంధంలో ఉండాల్సి వస్తుందని తెలిసినా వెనకడుగు వేయడం లేదు. స్వగృహాలకు చేరుకుని పరీక్షా కాలం పూర్తయిన అనంతరం తమ వాళ్లతో కలుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఝార్ఖండ్‌లోని లతేహర్‌లో జరిగింది. ఛత్తీస్‌గఢ్‌కు పనికోసం వెళ్లిన 11 మంది వలస కార్మికులు 900 కిలోమీటర్ల దూరాన్ని సైకిళ్ల ద్వారా ఛేదించారు. ఆరు రోజులపాటు సైకిల్‌పై ప్రయాణించి ఇళ్లు చేరారు.
ఇదీ జరిగింది..
లతేహర్కు చెందిన కార్మికులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇలా పనికోసం ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లారు ఆరాగూడీకి చెందిన 11మంది కార్మికులు. అయితే లాక్డౌన్ కారణంగా పనులు ఆగిపోయాయి. ఉపాధి లేక, ఆహారం లభించక ఆకలితో అలమటించే స్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో తమను రక్షించుకునేందుకు సైకిల్‌పై ప్రయాణించి అయినా ఇల్లు చేరాలని అనుకున్నారు వారంతా. ఆరు రోజుల పాటు 900 కిలోమీటర్లు ప్రయాణించి లతేహర్లోని ఆరాగూడీ గ్రామానికి చేరుకున్నారు.
ఆహారం కోసం దాచిన డబ్బుతో..
ఆహారం కోసం తమ వద్ద దాచుకున్న డబ్బుతో సైకిల్ కొనుగోలు చేసి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పారు కార్మికులు. ఆరు రోజుల పాటు అడవి మార్గం ద్వారా ప్రయాణించి ఇల్లు చేరినట్లు వివరించారు.
ఇదీ చూడండి: ప్లాస్మా థెరపీపై ఎయిమ్స్ క్లినికల్ ట్రయల్