ETV Bharat / bharat

సినీ పరిశ్రమతో డ్రగ్స్​ ముఠా లింకులపై ఆరా - కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్​ కలవరం

కర్ణాటక సినీపరిశ్రమకు డ్రగ్స్ ముఠాకు ఉన్న సంబంధంపై ఆరా తీసేందుకు సెంట్రల్ క్రైమ్​ బ్రాంచ్ రంగంలోకి దిగింది. వారికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కర్ణాటక హోం మంత్రి బసవరాజ్​ వెల్లడించారు.

CCB looking into film industry links
కర్ణాటక డ్రగ్స్​ కేసు
author img

By

Published : Aug 31, 2020, 8:25 AM IST

కర్ణాటకలో మాదక ద్రవ్యాల ముఠాతో సినీ పరిశ్రమకు ఉన్న లింకులపై ఆరా తీయాలని సెంట్రల్​ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ)ని కోరినట్లు రాష్ట్ర హోం మంత్రి బసవరాజ్​ బొమ్మై వెల్లడించారు. ఇటీవల డ్రగ్స్ ముఠా గుట్టు బయటపెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్​ బ్యూరో (ఎన్​సీబీ)కి పూర్తి సహకారం ఉంటుందని ఆయన తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్​కు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించినట్లు ఉద్ఘాటించారు బసవరాజ్​. సినీప్రముఖుడు, జర్నలిస్ట్ ఇంద్రజిత్​ లంకేశ్​ ఈ విషయంలో ఆయనతో ఉన్న సమచారాన్ని పోలీసులతో పంచుకోవాలని కోరారు. ఇంద్రజిత్ తన వద్ద డ్రగ్స్ వాడుతున్న పలువురు నటుల వివరాలు ఉన్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.

బెంగళూరులో డ్రగ్స్ మాఫియా విజృంభిస్తుందన్న సమాచారంతో ఎన్సీబీ చేపట్టిన ఆపరేషన్​లో పలు కీలక విషయాల తెలిశాయి. ఈ ఆపరేషన్​లో దాదాపు రూ. 2 కోట్లు విలువ చేసే మత్తు పదార్థాలను సీజ్ చేసి.. పలువురు డ్రగ్ డీలర్లను అదుపులోకి తీసుకుంది. ఈ కేసుతో సంబంధమున్న పలువురు ప్రముఖులను ఎన్​సీబీ అరెస్ట్​ చేసింది.

ఇదీ చూడండి:'సినీ తారలే.. గంజాయి రెగ్యులర్ కస్టమర్లు!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.