ETV Bharat / bharat

'పౌర' సెగ: కేరళ హర్తాళ్ హింసాత్మకం- 200 మంది అరెస్ట్​

author img

By

Published : Dec 17, 2019, 5:12 PM IST

Updated : Dec 17, 2019, 6:52 PM IST

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కేరళలో 30 ఇస్లామిక్​ సంఘాలు పిలుపునిచ్చిన హర్తాళ్​ హింసాత్మకంగా మారింది. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు 200 మందిని అరెస్ట్​ చేయడంపై ఆగ్రహించిన ఆందోళనకారులు...బస్సులపై రాళ్లు రువ్వారు.

CAA
పౌరసెగ
'పౌర' సెగ: కేరళ హర్తాళ్ హింసాత్మకం

పౌరసత్వ చట్టంపై వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు, బంగాల్​, దిల్లీని తాకిన పౌర సెగ కేరళలోనూ ఉద్రిక్తతలకు దారి తీసింది. 30 ఇస్లామిక్​ సంఘాలు, పలు రాజకీయ పార్టీలు పిలుపునిచ్చిన నేటి హర్తాళ్ ఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది. రాష్ట్రంలో పలుచోట్ల​ కేఎస్​ఆర్​టీసీ బస్సులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు... బలవంతంగా దుకాణాలను మూయించారు.

నిన్న ఉమ్మడిగా నిరసన వ్యక్తం చేసిన అధికార సీపీఎం నేతృత్వంలోని ఎల్​డీఎఫ్, ప్రతిపక్ష కాంగ్రెస్​-యూడీఎఫ్​ పార్టీలు నేటి హర్తాళ్​కు దూరంగా ఉన్నాయి.

తీవ్ర ఉద్రిక్తత...

హర్తాళ్​ను నియంత్రించేందుకు పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా 200 మందిని అరెస్ట్​ చేయడంపై ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని తిరువనంతపురంలో బస్సులపై రాళ్లు రువ్వగా.. ఒక ప్రయాణికుడికి గాయాలయ్యాయి. ఆందోళనకారులు సచివాలయం సమీపంలోని ఏజీ కార్యాలయం వైపునకు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు పలుమార్లు జలఫిరంగులను ప్రయోగించారు. అయినప్పటికీ నిరసనకారులు బారికేడ్లను దూకే ప్రయత్నం చేశారు.

పలుమార్లు పోలీసులు విజ్ఞప్తి చేసినప్పటికీ... కొంతమంది మహిళలు రోడ్డుపై కూర్చొన్ని పౌరసత్వ చట్టానికి, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తిరువనంతపురంతో పాటు కొల్లాం, పాలక్కాడ్​, ఎర్నాకులం, వయనాడ్, కోజికోడ్, కన్నూర్​ జిల్లాల్లో ఆందోళనలు మిన్నంటాయి. నేడు జరగాల్సిన పలు పాఠశాల, విశ్వవిద్యాలయ పరీక్షలు వాయిదా పడ్డాయి.

Nagpur (Maharashtra), Dec 17 (ANI): Former Maharashtra chief minister and Leader of Opposition (LoP) in the state assembly, Devendra Fadnavis, on December 17 said Chief Minister Uddhav Thackeray has betrayed the farmers, as he alleged that the latter will not release Rs 23,000 crore which are required as compensation to farmers who faced the brunt of unseasonal rains. "CM had announced that they'll provide Rs 25,000/hectare to farmers suffering due to untimely rainfall. But yesterday when the supplementary demands came, they had allotted only Rs 750 crore. If they have to give Rs 25,000/hectare then they should have allotted Rs 23,000 crore. The manner in which this govt is being run, in its first stage itself, it has betrayed the farmers of Maharashtra," Fadnavis told media in Nagpur.

Last Updated : Dec 17, 2019, 6:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.