కోల్కతాలోని బెలియాఘాట్ 33 పల్లి దుర్గ పూజ మండపంలో మత సామరస్యం వెల్లివిరుస్తోంది. సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా హిందూ మంత్రాలతోపాటు చర్చి గంటలను, ఇస్లాం అజాను ఏర్పాటు చేశారు. ప్రతి 5 నిమిషాలకోసారి ఈ ప్రత్యేక సంగీతాన్ని వినిపిస్తున్నారు. ఈ మండప నిర్వాహకుల ప్రయత్నంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
న్యాయవాది ఆక్షేపణ..
మండపం కమిటీపై శంతను సిన్హా అనే న్యాయవాది అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రతి 5 నిమిషాలకోసారి అజాను వినిపించడాన్ని ఏ ముస్లిం ఒప్పుకోరని, ఇది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారని తన పిటిషన్లో ఆరోపించారు.
ఇదీ చూడండి: తాలిబన్ల చెర నుంచి ముగ్గురు భారత ఇంజనీర్లకు విముక్తి!