ETV Bharat / bharat

'జాతీయ క్రీడా పురస్కారాల ప్రైజ్​ మనీ భారీగా పెంపు' - Sports Awards 2020

జాతీయ క్రీడలు, సాహస పురస్కారాలు-2020 ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం వర్చువల్​గా నిర్వహిస్తోంది కేంద్రం. ఈ సందర్భంగా పురస్కార విజేతలకు శుభవార్త అందించారు కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్​ రిజిజు. పురస్కారాల నగదు బహుమతిని భారీగా పెంచినట్లు ప్రకటించారు.

National Sports Awards
'జాతీయ క్రీడా పురస్కారాల ప్రైజ్​ మనీ భారీగా పెంపు'
author img

By

Published : Aug 29, 2020, 10:51 AM IST

జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ప్రారంభానికి ముందు కీలక ప్రకటన చేశారు కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్​ రిజిజు. అవార్డు విజేతలకు తీపికబురు అందించారు. నగదు బహుమతిని భారీగా పెంచినట్లు ప్రకటించారు మంత్రి.

జాతీయ క్రీడా పురస్కారాల నగదు బహుమతులను చివరి సారిగా 2009లో పెంచారు.

" క్రీడలు, సాహస పురస్కారాల నగదు బహుమతి పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. అర్జున అవార్డుకు రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షలు, ఖేల్​రత్న పురస్కారాలకు రూ. 7.5 లక్షల నుంచి రూ. 25లక్షలకు పెంచాం."

- కిరణ్​ రిజిజు, కేంద్ర క్రీడల శాఖ మంత్రి.

వర్చువల్​గా..

తొలిసారి జాతీయ క్రీడా, సాహస పురస్కారాలు-2020 కార్యక్రమాన్ని శనివారం (ఆగస్టు 29) వర్చువల్​గా నిర్వహిస్తోంది కేంద్రం. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​.. క్రీడాకారులకు వర్చువల్​గా ఈ పురస్కారాలను అందజేయనున్నారు. 60 మంది పురస్కార విజేతలు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్​ఏఐ, ఎన్​ఐసీ కేంద్రాల వద్ద హాజరై.. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొననున్నారు.

దిల్లీలోని విజ్ఞాన్​ భవన్​ నుంచి కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్​ రిజిజు, భారత ఒలంపిక్​ సమాఖ్య అధ్యక్షుడు నరేంద్ర ధృవ్​ బర్త, ఇతర అధికారులు హాజరుకానున్నారు.

ఇదీ చూడండి: వర్చువల్​గా జాతీయ క్రీడా పురస్కార వేడుకకు అంతా సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.