భాజపాకు దాని కీలక మిత్రపక్షం జేడీయూ షాకిచ్చింది. వివాదాస్పద మతమార్పిడి వ్యతిరేక చట్టంపై మండిపడింది. ఈ లవ్ జిహాద్ చట్టాన్ని వ్యతిరేకించింది.
"వివాదాస్పద మతమార్పిడి వ్యతిరేక చట్టం సమాజనికి తప్పుడు సంకేతాలిస్తుంది. ఇది సమాజానికి మంచిది కాదు. లవ్జిహాద్ను చూపి దేశంలో కొందరు ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారు. ఇలాంటి చట్టాల్ని తీసుకురావడం వల్ల సమాజంలో చీలిక ఏర్పడుతుంది. కొన్ని వర్గాల ప్రజలు అణచివేతకు గరవుతారు. ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చట్టాల్ని జేడీయూ వ్యతిరేకిస్తుంది."
-కేసీ త్యాగీ, జేడీయూ అధికార ప్రతినిధి.
వేధనకు గురిచేసిందిఅరుణాచల్ప్రదేశ్లోని తమ ఆరుగురు ఎమ్మెల్యేలు భాజపాలో చేరడం తనకు బాధకలిగించిందన్నారు త్యాగీ. ఇటువంటి పరిణామాలు కూటమి సంబంధాల్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:యూపీలో 'లవ్ జిహాద్' మొదటి అరెస్టు