కేరళలోని కన్నూరులో ఓ రెస్టారెంట్లో అతిథులకు వడ్డించేందుకు రోబో సర్వర్ భామలు చైనా నుంచి వచ్చేశారు. ఆడపిల్లల దుస్తుల్లో అందంగా కదిలే ఈ ముగ్గురు రోబో సర్వర్లను 'బీ @ కివిజో' అనే రెస్టారెంట్ వారు దిగుమతి చేసుకున్నారు. ఐదడుగుల ఎత్తుండే ఒక్కో రోబోకి 15 లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. వాటికి అలీనా, హెలెన్, జేన్ అని పేర్లు కూడా పెట్టారు.
ఈ రెస్టారెంట్లో వినియోగదారులు తమ టేబుల్ మీద ఉండే ట్యాబ్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేస్తారు. షెఫ్‌లు వంటకాలు సిద్ధం చేయగానే రోబోలు ప్రేమగా పలకరించి మరీ అతిథులకు ఆహారం అందిస్తాయి. జ్యూస్బాక్స్, బేకింగ్ మమ్మీ అనే కేఫ్‌ల నుంచి ఆర్డర్లను కస్టమర్లకు అందిస్తాయి ఈ రోబోలు. అంతే కాదండోయ్.. పిల్లలకు బోర్ కొట్టకుండా ఆడించేందుకు ఇక్కడో నాలుగడుగుల పిల్ల రోబో కూడా ఉంది.
మలయాళ సినీ నటుడు మనియన్ పిల్ల రాజు ఈ రెస్టారెంట్‌కు భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. బ్రాండ్ అంబాసిడర్ కూడా ఈయనే. రోబో సర్వర్లతో వ్యాపారం బాగా పెరుగుతోంది. దీన్ని ఆదర్శంగా తీసుకుని... దోహాలో 2022 జరగబోయే ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీల సమయంలో, ఖతార్‌లో ఇలాంటి హోటల్ ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు హోటల్ యజమానులు.
ఇదీ చూడండి: 'దలైలామా వారసుడు చైనా నుంచే రావాలి'