దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. ఇప్పటివరకు కొవిడ్-19 బారినపడిన వారి సంఖ్య 2,66,598కి చేరింది. మరణాల సంఖ్య 7,466కి పెరిగింది. 1,29, 214 మంది వైరస్ నుంచి విముక్తి పొందారు.
మహారాష్ట్రలో 2,259 కేసులు
మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. మంగళవారం మరో 2259 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 90,787కు చేరింది. గత 24గంటల్లో రికార్డు స్థాయిలో 120 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 3289కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 44,849 మంది చికిత్స పొందుతుండగా... 42,638 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
తమిళనాడులో 286 మంది మృతి..
తమిళనాడులోనూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 1,685 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 21 మంది మృతి చెందారు. వరుసగా 10 రోజుల పాటు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 34,914కు ఎగబాకింది. ఇందులో 16,279 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 18,325 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 286కు చేరింది.
గుజరాత్లో 470 కేసులు..
గుజరాత్‌లోనూ వైరస్ ఉద్ధృతి పెరిగింది. గడిచిన 24గంటల్లో 470 మందికి కరోనా సోకింది. 33 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 21,044, మృతుల సంఖ్య 1313కు చేరినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా14,373 మంది ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.
బంగాల్లో 372కేసులు
బంగాల్లో మంగళవారం 372 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య తొమ్మిది వేలకు చేరువైంది. వీరిలో 4,950 మంది చికిత్స పొందుతుండగా... మరో 3,620 మంది కోలుకున్నారు.
కర్ణాటకలో 66 మంది మృతి..
కర్ణాటకలో కొత్తగా 161 కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19 సోకిన వారిలో ఇద్దరు మరణించగా మృతుల సంఖ్య 66కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 5,921కి ఎగబాకింది.
కరోనాతో జవాను మృతి
దిల్లీలోని సీఐఎస్ఎఫ్ అధికారికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్ ఫస్ట్ రిజర్వ్ బెటాలియన్‌కు చెందిన ఓ జవాను కరోనా కారణంగా మృతిచెందాడు. ఈ జవానుతో కలిపి సాయుధ బలగాల్లో మృతి చెందిన వారి సంఖ్య మొత్తంగా 55కు చేరింది. సీఏపీఎఫ్ దళాల్లో కరోనా సోకినవారి సంఖ్య 1670కి పెరిగింది. ఇప్పటి వరకు 1157 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- హరియాణాలో మంగళవారం 372 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 9 వేలకు చేరువైంది.
- ఉత్తరాఖండ్‌లో 77 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారించగా.. కేసుల సంఖ్య 1,488కి ఎగబాకింది. 749 మంది డిశ్ఛార్జి అయ్యారు. 13 మంది మృతి చెందారు.
- కేరళలో మంగళవారం 91 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 2 వేలు దాటింది. వీరిలో 1231 మంది చికిత్స పొందుతున్నారు.
- హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం బాధితుల సంఖ్య 437కు చేరింది. ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందారు.
- జమ్ముకశ్మీర్‌లో మొత్తం 4,346 మందికి వైరస్ సోకినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. వీరిలో జమ్ములో 939 మంది ఉండగా, 3,407 మంది కశ్మీర్ వాసులుగా తెలిపారు అధికారులు.
- మధ్యప్రదేశ్‌లో ఓ జిల్లా న్యాయమూర్తి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:రష్యాలో ఐదు లక్షలకు చేరువలో కరోనా కేసులు