ETV Bharat / bharat

ల్యాండింగ్​కు​ క్లియరెన్స్​ వచ్చాకే కూలిన విమానం!

కేరళ కోజికోడ్ విమాన ప్రమాద ఘటనపై ప్రాథమిక విచారణ పూర్తయింది. ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలడానికి ముందు ల్యాండింగ్​కు క్లియరెన్స్​ పొందినట్లు తెలుస్తోంది.

Kerala plane crash: After getting landing clearance, aircraft went out of runway, says preliminary report
ల్యాండింగ్​కు​ క్లియరెన్స్​ పొందిన తర్వాతే కుప్పకూలిన విమానం
author img

By

Published : Aug 9, 2020, 1:02 PM IST

కేరళ కోజికోడ్​లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనకు సంబంధించి ప్రాథమిక నివేదికను పౌర విమానయాన శాఖకు సమర్పించారు అధికారులు. విమానం ప్రమాదానికి గురవ్వడానికి ముందు ల్యాండింగ్​కు క్లియరెన్స్​ పొందినట్లు తెలిపారు.

నివేదిక ప్రకారం.. మొదట విమానం ల్యాండ్ అవ్వడానికి కంట్రోలర్​ క్లియరెన్స్ ఇచ్చింది. 2వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు విజిబిలిటీ, ఉపరితల పరిస్థితులు అనువుగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని పైలట్​కు సూచించింది. భారీ వర్షం పడుతున్నందు వల్లే విమానాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో పైలట్ ల్యాండ్ చేయాల్సి వచ్చింది. మొదటిసారి ల్యాండింగ్​కు ఆటంకం ఏర్పడిన తర్వాత విమానాన్ని 10 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాలని పైలట్​కు కంట్రోలర్ సూచించింది. 7 వేల అడుగుల ఎత్తుకు వెళ్లాక... కిందకు వచ్చేందుకు అనుమతించాలని పైలట్ కంట్రోలర్​ను కోరారు. 3 వేల 600 అడుగుల ఎత్తు తగ్గించుకున్న తర్వాత ల్యాండింగ్​కు మరోసారి క్లియరెన్స్ ఇచ్చింది. వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం సరిగ్గా ల్యాండ్​ కాలేకపోయింది. రన్​వేను బలంగా ఢీకొన్న వెంటనే పక్కకు జారిపోయింది. రన్​వేపై విమానం కనిపించకుండా పోయిన వెంటనే ఫైర్ బెల్, అలారంను యాక్టివేట్ చేసింది కంట్రోలర్​.

ఇదీ చూడండి: 101 రక్షణ పరికరాల దిగుమతులపై నిషేధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.