ETV Bharat / bharat

'ఎన్​ఎంసీ బిల్లును ఆమోదిస్తే నిరవధిక సమ్మె' - జాతీయ వైద్య కమిషన్

జాతీయ వైద్య కమిషన్(ఎన్​ఎంసీ)​ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు తీవ్రమయ్యాయి. దిల్లీలోని పలు ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు కూడా బహిష్కరించి ఆందోళనకు దిగారు రెసిడెంట్​ డాక్టర్లు. నేడు రాజ్యసభ ముందుకు ఎన్​ఎం​సీ బిల్లును తీసుకురానున్న నేపథ్యంలో ఆమోదిస్తే నిరవధిక సమ్మె చేపడతామని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే బిల్లు దిగువసభ దాటింది.

'ఎన్​ఎంసీ బిల్లును ఆమోదిస్తే నిరవధిక సమ్మె'
author img

By

Published : Aug 1, 2019, 12:07 PM IST

ఆందోళనకు చేస్తున్న వైద్యులు

వైద్యవిద్యా రంగంలో కీలక సంస్కరణలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం భారత వైద్య మండలి(ఐఎంఏ) స్థానంలో తీసుకొచ్చిన జాతీయ వైద్య కమిషన్‌(ఎన్​ఎంసీ) బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి. దేశ రాజధాని దిల్లీలోని చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెసిడెంట్‌ డాక్టర్లు సమ్మెకు దిగారు. ఎయిమ్స్‌, రామ్‌మనోహర్‌ లోహియా ఆసుపత్రుల్లో.. అత్యవసర సేవలు కూడా బహిష్కరించి ఆందోళన చేపట్టారు.

కేరళ త్రివేండ్రంలోని రాజ్​భవన్​ ముందు వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. వైద్య కమిషన్​ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. పోస్టర్లును కాల్చుతూ నిరసనలు చేశారు.

నేడు రాజ్యసభ ముందుకు..

ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన ఎన్​ఎం​సీ బిల్లు ఇవాళ రాజ్యసభ ముందుకు రానుంది. ఈ బిల్లును ఆమోదిస్తే నిరవధిక సమ్మెకు దిగుతామని రెసిడెంట్‌ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఎన్ఎంసీ బిల్లు ఆమోదం పొందితే వైద్యవిద్యలో విప్లవాత్మక మార్పులు వస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ చెబుతున్నారు. ఇది అతిపెద్ద సంస్కరణ అవుతుందని లోక్​సభలో చర్చ సందర్భంగా పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ముమ్మారు తలాక్​ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

Intro:Body:

SD

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.