ETV Bharat / bharat

'స్మగ్లింగ్​ కేసు'లో జోక్యం చేసుకోవాలని మోదీకి లేఖ - vijayan letter to modi

కేరళలో సంచలనం సృష్టించిన బంగారం స్మగ్లింగ్​ కేసు విచారణలో జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు ముఖ్యమంత్రి పినరయి విజయన్​. ఈ కేసుతో సంబంధమున్న ప్రతి ఒక్కరిని శిక్షించాలని కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే విధంగా ఉన్న కేసుపై అన్ని కేంద్ర సంస్థల సహకారంతో విచారణ చేపట్టాలన్నారు.

Kerala Gold Smuggling: Vijayan asks PM Modi's immediate intervention
స్మగ్లింగ్​ కేసులో జోక్యం చేసుకోవాలని మోదీకి విజయన్​ లేఖ
author img

By

Published : Jul 8, 2020, 9:52 PM IST

కేరళలో 30 కేజీల బంగారం స్మగ్లింగ్ ఘటనపై రాజకీయ దుమారం చెలరేగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు సీఎం పినరయి విజయన్. ఈ కేసులో తక్షణమే జోక్యం చేసుకుని దర్యాప్తు వేగవంతం చేయాలని వినతి చేశారు. ఈ కేసు దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచేలా ఉందన్నారు. అలాగే ఈ అంశంలో ఒకటికి మించిన కోణాలున్నాయని లేఖలో తెలిపారు.

ఈ కేసు దర్యాప్తు అన్ని కేంద్ర సంస్థల సహకారంతో ప్రభావవంతంగా జరగాలని లేఖలో పేర్కొన్నారు విజయన్. కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్కరిని వదలొద్దని కోరారు.

Kerala Gold Smuggling: Vijayan asks PM Modi's immediate intervention
మోదీకి విజయన్ లేఖ

ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన.. సరకు రవాణా విమానంలో దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యూఏఈ కాన్సులేట్‌ మాజీ ఉద్యోగి అయిన సరిత్‌ అనే వ్యక్తి వద్ద ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సరిత్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు.. స్వప్నాపై లుక్​ ఔట్‌ నోటీసులు జారీ చేశారు. యూఏఈ నుంచి కేరళలోని ఆ దేశ కాన్సులేట్‌కు వచ్చే పార్సిళ్ల ద్వారా 30 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: బంగారం స్మగ్లింగ్​ కుంభకోణంలో మరో మలుపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.