పెన్సిల్‌ను సాధారణంగా డ్రాయింగ్ వేయడానికి, రాయడానికి ఉపయోగిస్తారు. కేరళ కొట్టాయం జిల్లాలోని చంగనస్సెరికి చెందిన హుస్నా మాత్రం కొత్త కోణం వెతికింది. పెన్సిల్ నిబ్‌పై ఆకృతులు చెక్కే సూక్ష్మకళను ఆన్లైన్లో నేర్చుకుని రికార్డులు సృష్టిస్తోంది.


కేవలం వారంలోనే...
కేవలం వారం రోజుల్లో జాతీయ గేయం వందేమాతరం మొత్తాన్ని పెన్సిళ్ల నిబ్‌పై చెక్కి ఔరా అనిపించింది. బీబీఏం మూడో ఏడాది చదువుతున్న హుస్నా... ఏడాదిన్నరగా తన సృజనాత్మకతకు పదును పెడుతూ అద్భుతాలు చేస్తోంది. ఇప్పటివరకు 100కు పైగా ఆకృతులను చెక్కినట్లు తెలిపింది.




పెన్సిల్ నిబ్‌పై ఆకృతులు చెక్కడానికి కఠోర శ్రమ, సహనం, ఏకాగ్రత అవసరం. అయితే కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహంతో తాను ఇలాంటి ఆకృతులు చెక్కుతున్నట్లు చెప్పుకొచ్చింది హుస్నా. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు సాధించాలన్నదే తన ఆశయమని చెప్పింది.




ఇదీ చూడండి: భారత్ x చైనా: సైనిక శక్తిలో ఎవరిది పైచేయి?