చిన్న వయసులోనే కేరళ స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థిగా నిలబడి అందరి దృష్టిని ఆకర్షించిన 21 ఏళ్ల ఆర్య రాజేంద్రన్.. తిరువనంతపురం మేయర్‌గా సోమవారం ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన సభ్యులంతా కలిసి ఈమేరకు ఆర్యను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికతో దేశంలో అతి పిన్న వయస్కురాలైన మేయర్‌గా ఘనత సాధించారామె.
ఆర్య రాజేంద్రన్ ప్రస్తుతం బాలసంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీలోనూ సభ్యురాలిగా ఉన్నారు. ఇటీవల జరిగిన తిరువనంతపురం పురపాలక సంస్థ ఎన్నికల్లో ముడవన్ముగల్ వార్డు నుంచి సీపీఎం తరఫున పోటీ చేసి, గెలిచారు. ప్రత్యర్థి రెండు వేలకుపైన భారీ మెజారిటీ సంపాదించారు. బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న ఆర్య.. అందరికీ ఆరోగ్యం అందాలన్నదే లక్ష్యమని అనేక సందర్భాల్లో తెలిపారు.
ప్రముఖుల అభినందనలు..
మేయర్ ఆర్యకు కొన్ని రోజులుగా ప్రముఖుల నుంచి అభినందలు వెెల్లువెత్తున్నాయి. ప్రముఖ నటుడు మోహన్‌లాల్ ఆర్యకు శనివారం ఫోన్ చేసి అభినందించారు. వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్విట్టర్ ద్వారా తమ అభినందనలు తెలిపారు.
ఇదీ చూడండి : మేయర్ ఆర్య..! వయసు చిన్నది.. గెలుపు పెద్దది