ETV Bharat / bharat

'మోదీజీ పరీక్షలు రద్దు అయ్యేలా చూడండి ప్లీజ్​'

author img

By

Published : Jul 11, 2020, 8:16 PM IST

కరోనా విజృంభిస్తున్న వేళ వర్సిటీ పరీక్షలు నిర్వహించడానికి యూజీసీ ఆదేశాలివ్వడంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు రద్దు అయ్యేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీకి స్వయంగా లేఖ రాశారు. కొవిడ్ బారిన పడకుండా విద్యార్థుల భవితను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

Kejriwal writes to PM seeking cancellation of DU exams
కేజ్రీవాల్ మోదీ మమత

దిల్లీ యూనివర్సిటీ సహా మిగతా అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాల చివరి ఏడాది పరీక్షలు రద్దు చేయాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బంగాల్​ సీఎం మమతా బెనర్జీ... ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు.

తీవ్ర ఆగ్రహంతో...

వర్సిటీల ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను ఆన్​లైన్, ఆఫ్​లైన్​ల్లో నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్​ (యూజీసీ)... విశ్వవిద్యాలయాలు, కళాశాలలను ఆదేశించింది. దీనిపై విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు.

"మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (ఎంహెచ్​ఆర్​డీ), యూజీసీ పరీక్షలు రద్దు చేయడానికి సిద్ధంగా లేవు. అందువల్ల మీరు (మోదీ) జోక్యం చేసుకుని విశ్వవిద్యాలయాల ఫైనల్ ఇయర్ పరీక్షలు రద్దు అయ్యేలా చర్యలు తీసుకోవాలి. యువత భవితను కాపాడాలి."

- కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి

అలా ఎందుకు చేయకూడదు

'ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ (ఐఐటీలు), నేషనల్ లా యూనివర్సిటీ (ఎన్​ఎల్​యూ)లు ఇప్పటికే అంతర్గత మదింపు ఆధారంగా తుది సెమిస్టర్ విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశాయి. ప్రపంచ స్థాయి విద్యాలయాలు కూడా ఇదే పద్ధతిని అనుసరించాయి. మరి మిగతా విశ్వవిద్యాలయాలు ఎందుకు అలా చేయలేవు' అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు

బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా వర్సిటీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు చేయాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు. కరోనా విజృంభిస్తున్న వేళ పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని ఆమె పేర్కొన్నారు.

పరీక్షలు లేకుండానే..

దిల్లీ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని వర్సిటీల పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. పరీక్షలు కాకుండా ఇతర పద్ధతుల ద్వారా విద్యార్థులను ఉత్తీర్ణులను చేయాలని ఆదేశించాయి.

ఇదీ చూడండి: 'గల్వాన్​పై చైనా పాట కొత్తేం కాదు- జోరు పెంచింది అంతే'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.