ETV Bharat / bharat

ఆపరేషన్​ కశ్మీర్​: ఏంటీ ఆర్టికల్​ 35-ఎ?

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇచ్చిన ఉత్తర్వుల్లో జమ్ముకశ్మీర్‌ ప్రజలకు ప్రత్యేక హక్కులు, సౌకర్యాలు కల్పించే 35-ఎ అధికరణను రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అసలు ఆర్టికల్ '35-ఎ'లో ఏముంది?

ఆపరేషన్​ కశ్మీర్​: ఆర్టికల్​ 35ఎ అంటే ఏమిటి?
author img

By

Published : Aug 5, 2019, 2:06 PM IST

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370ని రద్దుచేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లోనే జమ్ముకశ్మీర్‌ ప్రజలకు ప్రత్యేక హక్కులు, సౌకర్యాలు కల్పించే '35-ఎ'నూ ప్రస్తావించారు. అసలు ఆర్టికల్ 35-ఎ లో ఏముంది? ఈ నిబంధనలను మార్చొద్దని జమ్ముకశ్మీర్ రాజకీయ పార్టీలు ఎందుకు పట్టుపట్టాయో ఓ పరిశీలన.

ఆర్టికల్‌ 370లో 35-ఎ నిబంధన ఒక భాగం

కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370లో 35-ఎ నిబంధన ఒక భాగం. ఈ నిబంధన కశ్మీర్‌లోని శాశ్వత నివాస నిబంధనలను సమగ్రంగా విశదీకరిస్తుంది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత షేక్‌ అబ్దుల్లా, నాటి ప్రధాని నెహ్రూ మధ్య 1952 జులైలో కుదిరిన దిల్లీ ఒప్పందం ప్రకారం కశ్మీరీలందరికీ భారత పౌరసత్వం ఇస్తారు. రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హక్కులు, సౌకర్యాలు కల్పించడం కోసం చట్టాలు చేసే అధికారం జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి ఉంటుంది. ఈ నిబంధనల్నే 1954 మే 14న రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్‌ 35ఏ కింద చేర్చారు. అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

కశ్మీరీలకే పరిమితం

ఆర్టికల్‌ 35-ఎ ప్రకారం భారత భూభాగానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లోని వారు కశ్మీర్‌లో భూ క్రయవిక్రయాలు చేయడం నిషేధం. ఒక వేళ చేసినా అది చట్ట ప్రకారం చెల్లుబాటు కాదు. 1954 మే 14న కన్నా ముందు లేదా ఆ తేదీ నాటికి జన్మించిన వ్యక్తి లేదా పదేళ్లు రాష్ట్రంలో నివసించిన వ్యక్తి మాత్రమే కశ్మీర్‌ శాశ్వత నివాసి అవుతాడని 35-ఎ నిబంధన స్పష్టం చేస్తోంది. శాశ్వత నివాసి అయిన వ్యక్తి మాత్రమే కశ్మీర్‌లో స్థిరాస్తుల్ని కలిగి ఉండవచ్చు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వం కల్పించే స్కాలర్‌షిప్‌లు, ఇతరత్రా సహాయాలు ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు. రాష్ట్ర స్థిర నివాసులు ఎవరో నిర్వచించడం కోసం చట్టాలు చేసే అధికారాన్ని జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి ఆర్టికల్‌ 35-ఎ కట్టబెట్టింది. అయితే ఈ నిర్వచనాన్ని మూడింట రెండొంతుల మెజారిటీతో రాష్ట్ర అసెంబ్లీ మార్చొచ్చు. దీర్ఘకాలం రాష్ట్రంలో నివసిస్తున్న వారికి ధ్రువపత్రాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయొచ్చు. కశ్మీరేతరుడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక కాకూడదని 1956 నవంబర్‌ 17న ఆమోదించిన నిబంధనను జమ్ముకశ్మీర్‌ రాజ్యాంగం స్పష్టం చేస్తోంది.

కశ్మీరేతరులను వివాహం చేసుకుంటే..

35ఎ నిబంధన ప్రకారం జమ్ము-కశ్మీర్‌లో పుట్టి, పెరిగిన ఓ మహిళ కశ్మీరేతరుడిని పెళ్లిచేసుకుంటే ఆమె కశ్మీర్‌లో స్థిరాస్తుల్ని కలిగి ఉండటానికి వీల్లేదు. ఆమె పిల్లలకూ ఆ ఆస్తిపై హక్కు లభించదు. పిల్లలకు శాశ్వత నివాస ధ్రువపత్రాన్ని ఇవ్వరు. ఈ నిబంధనపై డాక్టర్ సుశీల సాహ్నీ అనే కశ్మీరీ మహిళ వేసిన వ్యాజ్యంపై విచారణ జరిపినజమ్ముకశ్మీర్ హైకోర్టు 2002లో ఒక కీలక తీర్పును వెలువరించింది. శాశ్వత నివాసులు కాని వారిని వివాహం చేసుకున్న కశ్మీర్ మహిళలు వారి హక్కులేమీ కోల్పోరని తీర్పునిచ్చింది. కానీ, దీనిపై జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వానికేమీ ఆదేశాలివ్వలేదు.

ఇలా రద్దు అయ్యింది

ఆర్టికల్ 35-ఎ అధికరణం రాజ్యాంగబద్ధం కాదంటూ, దాన్ని రద్దు చేయాలని కోరుతూ నాలుగేళ్ల కిందట వి ది సిటిజన్స్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. జాతీయ మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు డాక్టర్ చారువాలీ ఖన్నా కూడా ఈ నిబంధనపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జమ్ముకశ్మీర్‌లో శాశ్వత నివాస గుర్తింపు లేని పురుషులను స్థానిక మహిళలు వివాహమాడినప్పుడు వారి సంతానానికి శాశ్వత నివాస గుర్తింపు దక్కడం లేదని వారు అక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేయలేకపోతున్నారని పేర్కొంటూ ఆమె ఈ అధికరణాన్ని సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు 2017 జులైలో కేంద్రం, జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై విచారణ జరుగుతుండగానే ఆర్టికల్‌ 35-ఎను రద్దుచేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి.

1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ 35-ఎ ఇంతవరకు పార్లమెంటు ఆమోదం పొందలేదు. ఇప్పుడు అదే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారానే ఆర్టికల్‌ 35ఎ ని రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వులతో కశ్మీర్‌లో ప్రజలకు లభిస్తున్న ప్రత్యేక హక్కులు, సౌకర్యాలన్నీ రద్దయ్యాయి.

ఇదీ చూడండి: ఆపరేషన్​ కశ్మీర్​: ఆర్టికల్​ 370 అంటే ఏమిటి?

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - Aug 5, 2019 (CCTV - No access Chinese mainland)
1. Graphic showing Chinese yuan's central parity rate against U.S. dollar
FILE: Beijing, China - Date Unknown (CCTV - No access Chinese mainland)
2. People's Bank of China headquarters
3. State Administration of Foreign Exchange (SAFE) building
FILE: China - Exact Location and Date Unknown (CCTV - No access Chinese mainland)
4. LED sign of RMB currency on digital screen
FILE: China - Exact Location, Date Unknown (CCTV - No access Chinese mainland)
5. Various of customers at bank
6. Various of Chinese yuan banknotes being counted
FILE: Beijing, China - Jan 2016 (CCTV - No access Chinese mainland)
7. Various of people doing business transaction
8. Electronic queuing machine at Bank of China
9. Bank clerk at work
FILE: China - Date and Exact Location Unknown (CCTV - No access Chinese mainland)
10. Various of Chinese yuan banknotes going through cash counting machine
11. Bundles of Chinese yuan, U.S. dollar banknotes on table
12. U.S. dollar banknotes being counted by bank clerk
FILE: Beijing, China - Jan 2016 (CCTV - No access Chinese mainland)
13. Various of U.S. dollar banknotes going through cash counting machine
The central parity rate of the Chinese currency renminbi, or the yuan, weakened 229 pips to 6.9225 against the U.S. dollar Monday, according to the China Foreign Exchange Trade System.
In China's spot foreign exchange market, the yuan is allowed to rise or fall by two percent from the central parity rate each trading day.
The central parity rate of the yuan against the U.S. dollar is based on a weighted average of prices offered by market makers before the opening of the interbank market each business day.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.