ETV Bharat / bharat

సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా - speaker

బలపరీక్ష జరుగుతుందని సుప్రీం ఆశాభావం
author img

By

Published : Jul 23, 2019, 10:57 AM IST

Updated : Jul 23, 2019, 10:14 PM IST

22:12 July 23

కుమారస్వామి రాజీనామా

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి కుమారస్వామి రాజీనామా చేశారు. గవర్నర్‌ వాజూభాయి వాలాను కలిసి రాజీనామా సమర్పించారు. శాసనసభలో జరిగిన బలపరీక్షలో ఓటమి అనంతంరం గవర్నర్ సమయాన్ని కోరిన కుమారస్వామి రాజ్​భవన్​కు చేరుకుని గవర్నర్​తో సమావేశమయ్యారు. బలపరీక్షలో ఓటమి కారణంగా రాజీనామా చేస్తున్నట్లు లేఖ సమర్పించారు. రాజీనామాను ఆమోదించిన గవర్నర్ నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కుమారస్వామిని కోరారు.

కర్ణాటక శాసనసభలో మొత్తం సీట్ల సంఖ్య 224. అధికారంలో ఉండాలంటే కనీసం 113 మంది సభ్యుల బలం అవసరం.

78 మంది సభ్యులున్న కాంగ్రెస్​, 37 మంది ఎమ్మెల్యేలున్న జేడీఎస్​, ఒక సభ్యుడున్న బీఎస్పీ, ఇద్దరు స్వతంత్రులతో కుమారస్వామి నేతృత్వంలో గతేడాది సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆరంభంలో అధికార పక్ష బలం 118. భాజపాకు 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమిలో సంక్షోభం జులై 6న మొదలైంది. రెండు పార్టీలకు చెందిన 16 మంది శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్​ కార్యాలయానికి వెళ్లి లేఖలు సమర్పించారు.
సంకీర్ణ కూటమిలో భాగస్వాములైన ఇద్దరు స్వతంత్రులు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. భాజపా పక్షాన చేరారు.

20:00 July 23

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. కాంగ్రెస్​-జేడీఎస్​ సర్కారు 13 నెలలకే సభా విశ్వాసం కోల్పోయింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య, సుదీర్ఘంగా సాగిన చర్చ తర్వాత బలపరీక్షలో కుమారస్వామి ఓడిపోయారు.

ఉదయం నుంచి వాడీవేడిగా జరిగిన చర్చ అనంతరం ముఖ్యమంత్రి కుమారస్వామి ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. తర్వాత స్పీకర్​ రమేశ్​ కుమార్​ ఓటింగ్​ నిర్వహించారు. ఆ సమయంలో సభలో మొత్తం 204 మంది సభ్యులు ఉన్నారు. అధికారం నిలుపుకునేందుకు కనీసం 103 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కూటమికి 99 ఓట్లు మాత్రమే రాగా... భాజపాకు 105 ఓట్లు వచ్చాయి. 

"కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమి విశ్వాస పరీక్షలో ఓడిపోయింది. సొంత పార్టీ ఎమ్మెల్యేల ద్రోహమే ఇందుకు కారణం. ఇలా ద్రోహం చేసేవారిని కర్ణాటక ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరు."
            -హెచ్​కే పాటిల్​, కాంగ్రెస్​ నేత

13 నెలలకే...

78 మంది సభ్యులున్న కాంగ్రెస్​, 37 మంది ఎమ్మెల్యేలున్న జేడీఎస్​, ఒక సభ్యుడున్న బీఎస్పీ, ఇద్దరు స్వతంత్రులతో కుమారస్వామి నేతృత్వంలో గతేడాది సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆరంభంలో అధికార పక్ష బలం 118. భాజపాకు 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమిలో సంక్షోభం జులై 6న మొదలైంది. రెండు పార్టీలకు చెందిన 16 మంది శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్​ కార్యాలయానికి వెళ్లి లేఖలు సమర్పించారు.

రసవత్తర రాజకీయాలు...

రిసార్ట్ రాజకీయాలు, సుప్రీంకోర్టులో కేసులు, బుజ్జగింపులతో కర్ణాటక రాజకీయాలు కొద్దిరోజులుగా నాటకీయ మలుపులు తిరిగాయి. 16 మంది అసంతృప్తుల్లో ఒకరు సొంత గూటికి తిరిగి రాగా... మిగిలిన వారు ముంబయికే పరిమితం అయ్యారు.

బలపరీక్షకు సిద్ధమని జులై 12న సీఎం కుమారస్వామి ప్రకటించారు. విశ్వాస తీర్మానంపై గతవారమే చర్చే ప్రారంభమైనా... ఓటింగ్​ మాత్రం జరగలేదు. బలపరీక్షను వాయిదా వేయిస్తూ... 15 మంది రెబల్స్​ను దారికి తెచ్చుకునేందుకు కాంగ్రెస్​-జేడీఎస్​ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. 

అనేక మలుపుల అనంతరం ఎట్టకేలకు నేడు బలపరీక్ష సాధ్యమైంది. కుమారస్వామి ప్రభుత్వం అధికారం కోల్పోయింది. 

భాజపా హర్షం...

కూటమిలో సంక్షోభం మొదలైన నాటి నుంచి భాజపా ఆచితూచి వ్యవహరించింది. అసంతృప్తులతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ వచ్చింది. బలపరీక్షను వాయిదా వేస్తూ వచ్చినా... ఓపికగా వ్యవహరించింది. 

చివరకు విశ్వాసపరీక్షలో కుమారస్వామి ఓడిపోవడంపై కమలదళం హర్షం వ్యక్తంచేసింది. కర్ణాటకలో మరోమారు అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. 
 
19:44 July 23

సంక్షోభానికి తెర..

కుమారస్వామి ప్రభుత్వం బలపరీక్షలో ఓడిపోయినట్లు స్పీకర్​ ప్రకటించారు.

బలపరీక్షకు సిద్ధమని జులై 12న సీఎం కుమారస్వామి ప్రకటించారు. విశ్వాస తీర్మానంపై గతవారమే చర్చే ప్రారంభమైనా... ఓటింగ్​ మాత్రం జరగలేదు. అనేక మలుపుల అనంతరం ఎట్టకేలకు నేడు బలపరీక్ష సాధ్యమైంది. కుమారస్వామి ప్రభుత్వం అధికారం కోల్పోయింది. 
 
19:39 July 23

కూలిన సంకీర్ణం..

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షలో విఫలమైంది.  ప్రభుత్వానికి అనుకూలంగా కేవలం 99 మంది ఓటు వేశారు.
15 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో సంకీర్ణ ప్రభుత్వంలో గత కొద్ది రోజులుగా సంక్షోభం ఏర్పడింది. 
 
19:26 July 23

ఓటింగ్ ప్రారంభం...

అసెంబ్లీలో కుమార స్వామి విశ్వాస పరీక్షపై ఓటింగ్​ ప్రారంభం అయింది. సభలో మెజారిటీ లేనుందున సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

19:05 July 23

'నా జేబులోనే రాజీనామా లేఖ'

రాజీనామా లేఖను సిద్ధం చేసుకునే అసెంబ్లీకి వచ్చినట్లు స్పీకర్​ రమేశ్ కుమార్ తెలిపారు. ఈ రోజు ఏం జరుగుతుందో తనకూ తెలియదని ప్రకటించారు.

18:52 July 23

కాసేపట్లో ఓటింగ్​?

మరికాసేపట్లో కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్షపై ఓటింగ్​ జరిగే అవకాశాలున్నాయి. సభలో బల నిరూపణ జరగాలని.. రాజకీయ పరిణామాలతో విసిగిపోయాన్నారు సీఎం కుమార స్వామి. విశ్వాస పరీక్షలో గెలిచినా, ఓడినా తానెక్కడికీ పారిపోనని స్పష్టం చేశారు. ప్రజలను, ప్రతిపక్షాన్ని వేచిచూసేలా చేసినందుకు క్షమాపణలు చెప్పారు.

18:43 July 23

'బల పరీక్షకు సిద్ధం'

అసెంబ్లీలో ప్రసంగం అనంతరం తాను ఎటూ పారిపోనన్నారు కుమార స్వామి.  తాను బల పరీక్షకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. 

18:39 July 23

స్పీకర్​ భావోద్వేగ ప్రసంగం

అసెంబ్లీలో స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ భావోద్వేగ ప్రసంగం చేశారు. సభలో జరిగిన పరిణామాలన్నింటితో తను ఆగ్రహానికి గురయ్యాయని వివరించారు. రాజ్యాంగ బద్ధంగానే తన విధులను నిర్వర్తించానని.. కనీస సంప్రదాయాలు పాటించకుండా సభ్యులు ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

18:28 July 23

రాజీనామా దిశగా కుమార స్వామి ?

కర్ణాటక సీఎం కుమారస్వామి రాజీనామా చేసే అవకాశముంది. సభలో సుదీర్ఘ ప్రసంగం తర్వాత గవర్నర్‌కు రాజీనామా సమర్పిస్తారని ప్రచారం సాగుతోంది.  రాజీనామాకు దారితీసిన పరిస్థితులు, సంకీర్ణ ప్రభుత్వాన్ని భాజపా అస్థిరపరిచిన తీరుపై సభలో సుదీర్ఘంగా వివరిస్తున్నారు.  సంకీర్ణానికి తగిన బలం లేనందున విశ్వాస పరీక్షకు దూరంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

17:50 July 23

బెంగళూరులో 144 సెక్షన్​...

విశ్వాస పరీక్ష సందర్భంగా బెంగళూరులో పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రభుత్వం పడిపోతే అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు బెంగళూరులో 144 సెక్షన్ విధించారు. రానున్న 48 గంటలపాటు ఇది అమలులో ఉండనుంది.

17:46 July 23

విశ్వాస పరీక్షపై మాట్లాడుతున్న సీఎం

కర్ణాటక అసెంబ్లీలో  విశ్వాస పరీక్షపై సీఎం కుమారస్వామి ప్రసంగిస్తున్నారు. అనంతరం బలపరీక్ష ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

14:43 July 23

విధానసభలో మాటల దాడి...

కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్​-భాజపా సభ్యుల మధ్య మాటల యుద్ధం పెరిగింది. విశ్వాస పరీక్ష అంశంపై ఉదయం నుంచి చర్చ సాగుతుంది. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ప్రస్తావించారు కాంగ్రెస్​ మంత్రి డీకే శివకుమార్​. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకూ అర్హత కోల్పోతారని పేర్కొన్నారు. 

డీకే వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు భాజపా నేత జగదీశ్​ షట్టర్​. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదని.. వారికి విప్​ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్​-జేడీఎస్​ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. 

అయితే.. విప్​ ఉల్లంఘించే ఎమ్మెల్యేలపై ​వేటు తప్పదని  కాంగ్రెస్​ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య, మంత్రి కృష్ణబైరేగౌడ పేర్కొన్నారు.  

14:26 July 23

'వాళ్నే నన్ను వెన్నుపోటు పొడిచారు'

కర్ణాటక అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్​ నేత శివకుమార్​ అసమ్మతి నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి భాజపా ఎమ్మెల్యేలు తనను వెన్నుపోటు పొడవలేదని... ఆ పని చేసింది అసమ్మతి నేతలేనని ఆరోపించారు. అసమ్మతి ఎమ్మెల్యేలు తనను వెన్నుపోటు పొడిచినట్టే... అందరినీ దెబ్బతీస్తారని విమర్శించారు. వారికి అసలు మంత్రులయ్యే అర్హతే లేదన్నారు శివకుమార్​.

13:32 July 23

బలపరీక్ష జరుగుతుందని సుప్రీం ఆశాభావం

కన్నడ రాజకీయ సంక్షోభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కీలక పరిణామాల నేపథ్యంలో.. స్వతంత్ర ఎమ్మెల్యేల పిటిషన్​పై వాదనలు విన్న అనంతరం విచారణ రేపటికి వాయిదా వేసింది. బలపరీక్ష ఇవాళ పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది అత్యున్నత న్యాయస్థానం.

బలపరీక్షను వెంటనే జరిపేలా ఆదేశించాలని సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్లు దాఖలు చేశారు కర్ణాటక స్వతంత్ర ఎమ్మెల్యేలు శంకర్​, నగేశ్​. వెంటనే విచారణ జరిపించాలన్న విజ్ఞప్తిని తిరస్కరించిన కోర్టు.. నేడు వాదనలు విన్న అనంతరం రేపటికి వాయిదా వేసింది. 

రోహత్గీ, సింఘ్వీ వాదనలు...

రాజీనామా చేసిన ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది ముకుల్​ రోహత్గీ, స్పీకర్​ తరఫున అభిషేక్​ సింఘ్వీ వాదనలు వినిపించారు.  రెబల్స్​ తరఫున వాదించిన రోహత్గీ.. ఈ రోజు సాయంత్రం 6 గంటల్లోగా బలపరీక్ష జరిపించేలా ఆదేశించాలని కోర్టును కోరారు. 

            స్పీకర్​ తరఫున వాదించిన సింఘ్వీ.. విశ్వాస పరీక్షపై ఈ రోజు చర్చ పూర్తవుతుందని.. అనంతరం బలపరీక్ష నిర్వహిస్తామని వాదించారు. వీరి వాదనలు పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. విచారణను రేపటికి వాయిదా వేసింది.  

సభలో వాడీవేడి చర్చ..

విశ్వాస పరీక్ష అంశంపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ కొనసాగుతోంది. అయితే.. విధానసభకు ఎక్కువ మంది హాజరుకాకపోవడం వల్ల బలనిరూపణ అంశంపై కొద్దిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చ ముగించి.. బలపరీక్ష జరిపిస్తానని కోర్టుకు తెలిపారు స్పీకర్​ రమేశ్​ కుమార్​.

కుమారస్వామి ఎక్కడ..?

సభ చర్చ కొనసాగుతున్నా ముఖ్యమంత్రి కుమారస్వామి ఇంతవరకూ అసెంబ్లీకి చేరుకోలేదు. బలనిరూపణ అంశంపై బయట వేర్వేరుగా చర్చలు జరుపుతున్నారు. అంతకుముందు.. కాంగ్రెస్​ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు సీఎం. అనంతరం.. మాజీ ప్రధాని దేవేగౌడతో సంప్రదింపులు జరిపారు కుమారస్వామి. 
సుప్రీంకోర్టు కూడా బలపరీక్షపై ఆశాభావం వ్యక్తం చేసిన నేపథ్యంలో నేడు ఏం జరుగుతుందోనని అంతటా ఆసక్తి నెలకొంది. అందరి దృష్టీ కర్ణాటకపైనే నెలకొంది. 

12:08 July 23

'బలపరీక్ష' పిటిషన్లపై వాదనల అనంతరం వాయిదా..

బలపరీక్ష చేపట్టేలా ఆదేశించాలని స్వతంత్ర ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా వేసింది ధర్మాసనం. కర్ణాటకలో ఇవాళ లేదా రేపు బలపరీక్ష పూర్తవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది అత్యున్నత న్యాయస్థానం. 

రాజీనామా చేసిన ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది ముకుల్​ రోహత్గీ, స్పీకర్​ తరఫున అభిషేక్​ సింఘ్వీ వాదనలు వినిపించారు.  

రెబల్స్​ తరఫున వాదించిన రోహత్గీ.. ఈ రోజు సాయంత్రం 6 గంటల్లోగా బలపరీక్ష జరిపించేలా ఆదేశించాలని కోర్టును కోరారు. స్పీకర్​ తరఫున వాదించిన సింఘ్వీ.. విశ్వాస పరీక్షపై ఈ రోజు చర్చ పూర్తవుతుందని.. అనంతరం బలపరీక్ష నిర్వహిస్తామని వాదించారు. వీరి వాదనలు పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. విచారణను రేపటికి వాయిదా వేసింది. 

11:51 July 23

మరికాసేపట్లో సుప్రీంలో విచారణ..

కర్ణాటక రాజకీయ సంక్షోభం అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై మరికాసేపట్లో విచారణ జరగనుంది. బలనిరూపణ చేసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని.. స్వతంత్ర ఎమ్మెల్యేలు శంకర్​, నగేశ్​లు సోమవారం వ్యాజ్యం దాఖలు చేశారు. విప్​పై స్పష్టత అంశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి, కర్ణాటక కాంగ్రెస్​ అధ్యక్షుడు దినేశ్​ గుండూరావు.. అంతకముందే వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపైనా అత్యున్నత న్యాయస్థానం వాదనలు వినే అవకాశముంది.

11:35 July 23

సభకు రాని సీఎం.. బలపరీక్షపై మళ్లీ అనుమానాలు..?

కర్ణాటక విధానసభలో విశ్వాస పరీక్షపై చర్చ కొనసాగుతోంది. అయితే... ముఖ్యమంత్రి కుమారస్వామి ఇంతవరకు సభకు వెళ్లలేదు. ఫలితంగా.. బలనిరూపణపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

11:14 July 23

సంక్షోభం కొలిక్కి వచ్చేనా...?

కర్ణాటక రాజకీయ సంక్షోభం తుది దశకు చేరేలా ఉంది. క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్న విశ్వాస పరీక్ష ఈ రోజు ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది. ఉత్కంఠల నడుమ సభ ప్రారంభమైంది. విశ్వాస పరీక్ష పై చర్చ కొనసాగుతోంది.  

సోమవారం ఎట్టి పరిస్థితుల్లోనూ బలనిరూపణ జరిపిస్తానని స్పీకర్​ రమేశ్​ కుమార్​ హామీ ఇచ్చినా.. అధికార ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం లేక అసెంబ్లీ నేటికి వాయిదా పడింది. అయితే.. ఈ రోజు సాయంత్రం 6 గంటల్లోగా విశ్వాసంపై ఓటింగ్​ జరగాలని ప్రభుత్వానికి డెడ్​లైన్​ విధించారు సభాపతి.

రెబల్స్​ స్పందన...

రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను ఈ రోజు ఉదయం 11 గంటలకు తన కార్యాలయంలో కలవాల్సిందిగా సోమవారం నోటీసులు ఇచ్చారు స్పీకర్​. అయితే.. దీనిపై స్పందించిన 13 మంది అసంతృప్త శాసనసభ్యులు సభాపతిని కలిసేందుకు 4 వారాల సమయం కావాలని లేఖ రాశారు.

తాజా పరిణామాల నేపథ్యంలో స్పీకర్​.. వీరిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ రోజు ఓటింగ్​కు సిద్ధమని ప్రకటించింది అధికార పక్షం. అయితే.. రెబల్​ ఎమ్మెల్యేలు రాకుంటే వారిపై అనర్హత వేటు వేస్తామని హెచ్చరించింది.

మరోవైపు విప్​పై స్పష్టత అంశంలో కర్ణాటక సీఎం కుమారస్వామి, రాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు దినేశ్​ గుండూరావు వేసిన పిటిషన్లపై సుప్రీం నేడు విచారణ చేపట్టే అవకాశముంది. సోమవారమే బలపరీక్ష జరిపించేలా ఆదేశించాలని స్వతంత్ర ఎమ్మెల్యేలు శంకర్​, నగేశ్​ దాఖలు చేసిన పిటిషన్లపైనా అత్యున్నత న్యాయస్థానం నేడు వాదనలు విననుంది.

10:42 July 23

విధానసభ ప్రారంభం.. సాగుతున్న చర్చ

ఉత్కంఠల నడుమ కన్నడ విధానసభ ప్రారంభమైంది. విశ్వాస పరీక్ష అంశంపై చర్చ కొనసాగుతోంది. ఎమ్మెల్యేల మధ్య వాడీవేడి వాదన జరుగుతోంది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ బలనిరూపణ జరిపిస్తానని హామీ ఇచ్చారు స్పీకర్​ రమేశ్​ కుమార్​. సాయంత్రం 6 గంటల వరకు డెడ్​లైన్​ విధించారు. ఫలితంగా.. అందరి దృష్టి కర్ణాటకపై కేంద్రీకృతమైంది. 

10:27 July 23

బలనిరూపణ నేడు జరిగేనా..?

కర్ణాటక రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. ఈ సంక్షోభానికి సోమవారం ముగింపు పలుకుతామని స్పీకర్​ రమేశ్​కుమార్​ హామీ ఇచ్చినా.. సభలో గందరగోళం కారణంగా అసెంబ్లీ నేటికి వాయిదా పడింది. ఈ రోజు సాయంత్రం 6 గంటల్లోగా విశ్వాసంపై ఓటింగ్ జరగాలని​ ప్రభుత్వానికి డెడ్​లైన్​ విధించారు స్పీకర్​.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Jul 23, 2019, 10:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.