సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్ష వ్యవహారం సోమవారం అర్ధరాత్రి అయినా ఎటూ తేలకపోవటం వల్ల విధాన సభ మంగళవారం ఉదయం 10 గంటల వరకు వాయిదా పడింది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు చర్చ కొనసాగించి 6 గంటలకు విశ్వాస పరీక్ష నిర్వహిస్తామని స్పీకర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు.
కర్'నాటకం': తేలని విశ్వాసం.. రేపటికి వాయిదా - కుమారస్వామి
04:11 July 23
సభ రేపటికి వాయిదా
22:32 July 22
బలపరీక్ష ఎప్పుడో..?
- విశ్వాస పరీక్షపై మాట్లాడుతున్న సభ్యులు
- వెంటనే బలపరీక్ష నిర్వహించాలని యడ్యూరప్ప డిమాండ్
- విశ్వాసపరీక్ష నిర్వహణకు తాను సిద్ధమని మరోసారి చెప్పిన స్పీకర్
- కుమారస్వామి, సిద్ధరామయ్య, పరమేశ్వర ఓ నిర్ణయానికి రావాలని స్పీకర్ సూచన
- సభ్యుల్లో చాలామంది మధుమేహ రోగులు ఉన్నారన్న స్పీకర్
- సభ్యుల్లో చాలామంది ఏమీ తినకుండానే సభలో ఉన్నారన్న స్పీకర్
- రాత్రి ఒంటిగంట వరకైనా సభలోనే ఉంటామన్న యడ్యూరప్ప
- బలపరీక్ష నిర్వహించాలని యడ్యూరప్ప పట్టు
21:45 July 22
ఖండించిన కుమారస్వామి...
రాజీనామా ప్రచారంపై కుమారస్వామి స్పందించారు. తాను రాజీనామాను గవర్నర్‌కు పంపినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్త రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేసి లేఖ సృష్టించినట్లు ఆరోపించారు. ఇలాంటి నీచ రాజకీయాలు చూస్తే ఆశ్చర్యమేస్తుందని సభలో పేర్కొన్నారు.
21:41 July 22
బలపరీక్ష ఎలా పెడతారు..?
- సభ్యుల రాజీనామాలు తేల్చకుండా బలనిరూపణ ఎలా చేస్తారు?: సీఎం
- సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకైనా ఆగాలన్న సీఎం కుమారస్వామి
- బలనిరూపణ కోసం పట్టుబడుతున్న భాజపా సభ్యులు
21:06 July 22
యడ్యూరప్ప పట్టు...
- ఇవాళ విశ్వాసపరీక్ష పూర్తవుతుందని సీఎం కుమారస్వామి హామీ ఇచ్చారు: యడ్యూరప్ప
- ఇవాళ ఎట్టి పరిస్థితిలోనూ విశ్వాస పరీక్ష పూర్తి కావాలి: యడ్యూరప్ప
- అర్ధరాత్రి 12 గంటల వరకైనా మేము సభలోనే ఉంటాం: యడ్యూరప్ప
20:53 July 22
బలపరీక్ష నిర్వహిస్తే...
- శాసనసభలో విశ్వాసపరీక్షపై ఉత్కంఠ
- ఇవాళ సభకు హాజరైన 205 మంది సభ్యులు
- బలపరీక్ష నిర్వహిస్తే అవసరమైన సంఖ్యాబలం 103
- రాజీనామా చేసిన 15 మందితో పాటు మరో నలుగురు గైర్హాజరు
20:45 July 22
కూమరస్వామి విన్నపం...
ఆందోళన చేస్తోన్న సభ్యులను తమ స్థానాల్లో కూర్చోవల్సిందిగా సీఎం కుమారస్వామి కోరారు. ఎట్టకేలకు సభ్యులు వారి స్థానాల్లో కూర్చున్నారు.
20:36 July 22
సభలో గందరగోళం...
సభలో జేడీఎస్, కాంగ్రెస్ సభ్యులు బలపరీక్ష వాయిదాపై పట్టుబట్టారు. సభాపతి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ విశ్వాసపరీక్ష నిర్వహించి తీరతానని తేల్చి చెప్పారు. సభను వాయిదా వేసే ప్రసక్తే లేదన్నారు.
20:25 July 22
కుమారస్వామితో స్పీకర్ భేటీ...
సీఎం కుమారస్వామి, డిప్యూటీ సీఎం పరమేశ్వర, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యతో స్పీకర్ రమేశ్ కుమార్ భేటీ అయ్యారు. విధానసభలోని స్పీకర్ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది.
19:26 July 22
రాత్రి 9గంటల్లోగా బలపరీక్ష నిర్వహించాలి : స్పీకర్
బలపరీక్షకు రాత్రి 9 గంటల వరకూ కుమారస్వామికి సమయమిచ్చారు స్పీకర్ రమేశ్ కుమార్. లేకపోతే తానే రాజీనామా చేసి వెళ్తానని సీఎంకు స్పష్టం చేశారు సభాపతి.
19:21 July 22
వాయిదా అనంతరం ప్రారంభమైన సభ
- వాయిదా అనంతరం ప్రారంభమైన శాసనసభ
- శాసనసభ విరామంలో స్పీకర్‌తో భేటీ అయిన భాజపా సభ్యులు
- ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ బలపరీక్ష నిర్వహించాలని పట్టు
- బలపరీక్ష నిర్వహణకు తాను సిద్ధమని స్పష్టం చేసిన స్పీకర్
- స్పీకర్‌తో భేటీ అయిన జేడీఎస్ సభ్యులు
- బలపరీక్షకు రేపటి వరకు సమయం ఇవ్వాలని జేడీఎస్ విజ్ఞప్తి
- సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేసిన జేడీఎస్
- సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే బలపరీక్ష పెట్టాలని సూచన
- తాను చెప్పినట్లు బలపరీక్ష జరపాలని స్పష్టం చేసిన స్పీకర్
19:14 July 22
భాజపా, జేడీఎస్ సభ్యులతో స్పీకర్ సమావేశం
పలువురు భాజపా, జేడీఎస్ నేతలతో విధాన సౌధలోని తన ఛాంబర్లో సమావేశమయ్యారు స్పీకర్ రమేశ్ కుమార్
19:04 July 22
అరగంట గడిచినా ప్రారంభం కాని సభ
కర్ణాటక శాసనసభ 10 నిమిషాలు వాయిదా పడింది. బలపరీక్ష వద్దని కోరుతున్నారు కాంగ్రెస్ సభ్యులు. స్పీకర్ తీరుపై భాజపా సభ్యులు ఆందోళనకు దిగారు
18:26 July 22
గందరగోళం నడుమ సభ 10నిమిషాలు వాయిదాా..
- బలపరీక్షకు సిద్ధం కావాలని కుమారస్వామిని కోరిన స్పీకర్
- బలపరీక్షకు సమయం కావాలని కోరిన సీఎం కుమారస్వామి
- బలపరీక్ష నిర్వహించాలని భాజపా సభ్యుల పట్టు
- అధికార, విపక్షాలు మాట్లాడుకుని బలపరీక్షపై నిర్ణయం తీసుకోవాలన్న స్పీకర్
- దీంతో రాజీనామాకు సిద్ధపడిన ముఖ్యమంత్రి కుమారస్వామి
- రాజభవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పిస్తారని ఊహాగానాలు
- ముఖ్యమంత్రి కాన్వాయ్ సిద్ధం చేస్తున్న అధికారులు
17:41 July 22
రాజీనామాకు సిద్ధమైన కుమారస్వామి?
కర్ణాటకలో అధికార కూటమి భవితవ్యంపై ఈ రోజైనా స్పష్టత వస్తుందా లేదా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వాస తీర్మానంపై ఓటింగ్ ఈ రోజే జరిగి తీరాలని స్పీకర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. చర్చకు ఎక్కువ సమయం పట్టకుండా... ఒక్కొక్కరు 10 నిమిషాలు మాత్రమే మాట్లాడాలని సభ్యులకు సూచించారు. ప్రస్తుతం సభలో చర్చ కొనసాగుతోంది.
సభలో బలం నిరూపించుకునేందుకు తాము సిద్ధమేనని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య తెలిపారు. విప్‌పై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చే వరకు బలపరీక్షపై ఓటింగ్‌ను వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరారు. ఇందుకు నిరాకరించారు సభాపతి.
ముంబయిలో ఉన్న 15మంది రెబల్ ఎమ్మెల్యేలు కర్ణాటకకు వస్తే తమకే మద్దతు ఇస్తారన్నారు సిద్ధరామయ్య. అక్కడ వారు అసౌకర్యంగా ఉన్నట్లు తనతో చెప్పారని తెలిపారు.
మాటల యుద్ధం
అసెంబ్లీలో కాంగ్రెస్-భాజపా మధ్య మాటల యుద్ధం జరిగింది. విశ్వాస పరీక్ష సందర్భంగా... కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భాజపా కుట్ర పన్నిందని ఆరోపించారు మంత్రి కృష్ణ భైరెగౌడ. ఆపరేషన్ కమల అమలు చేస్తున్నారన్నారు. మంత్రి ఆరోపణల్ని ఖండించిన ప్రతిపక్షనేత యడ్యూరప్ప, భాజపా ఎమ్మెల్యేలు... కూటమి నేతలపై ఎదురుదాడికి దిగారు.
సంకీర్ణ కూటమిలో అంతర్గత కలహాల వల్లే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారన్నారు యడ్యూరప్ప. ఈ అంశంతో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఈ రోజు ఎట్టిపరిస్థితుల్లోనూ కుమారస్వామి బలం నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
రెబల్ ఎమ్మెల్యేలకు సమన్లు జారీ చేశారు సభాపతి. మంగళవారం ఉదయం 11 గంటలకు తన కార్యాలయంలో కలవాల్సిందిగా ఆదేశించారు. సంకీర్ణ కూటమి నేతలు.. రెబల్స్‌పై అనర్హత పిటిషన్లు దాఖలు చేయగా.. స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
16:44 July 22
సభలో కొనసాగుతోన్న చర్చ..
కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్-భాజపా మధ్య మాటల యుద్ధం జరిగింది. విశ్వాస పరీక్ష సందర్భంగా... కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భాజపా కుట్ర పన్నిందని ఆరోపించారు మంత్రి కృష్ణ భైరెగౌడ. ఆపరేషన్ కమల అమలు చేస్తున్నారన్నారు. మంత్రి ఆరోపణల్ని ఖండించిన ప్రతిపక్షనేత యడ్యూరప్ప, భాజపా ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగారు.
సంకీర్ణ కూటమిలో అంతర్గత కలహాల వల్లే.. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారన్నారు యడ్యూరప్ప. ఈ అంశంతో తమకెలాంటి సంబంధం లేదన్నారు. ఈ రోజు ఎట్టిపరిస్థితుల్లోనూ కుమారస్వామి బలనిరూపణ చేసుకోవాలని వ్యాఖ్యానించారు.
14:18 July 22
కన్నడ అసెంబ్లీలో మాటల యుద్ధం
కన్నడ అసెంబ్లీలో విశ్వాస పరీక్షపై చర్చ ప్రారంభమయింది. సభ ప్రతిష్ఠకు భంగం కలిగించవద్దని ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు సభాపతి రమేశ్ కుమార్. సభ వాయిదా పడేందుకు రచించే వ్యూహాలతో అసెంబ్లీ గౌరవాన్ని దెబ్బతీయొద్దని పేర్కొన్నారు. ప్రశాంతంగా చర్చలో పాల్గొనాల్సిందిగా సూచించారు.
12:23 July 22
సభ గౌరవానికి భంగం కలిగించొద్దు: స్పీకర్
కర్ణాటక అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. ఈ రోజే బలపరీక్ష జరిగేలా చూస్తానని చెబుతున్నారు స్పీకర్ రమేశ్ కుమార్. సుప్రీంకోర్టు... ఆదేశాల కోసం ఎదురుచూసినందునే సభ కొద్దిగా ఆలస్యం అయిందని స్పష్టం చేశారు.
అంతకుముందు స్పీకర్‌తో వేర్వేరుగా సమావేశమైంది జేడీఎస్, భాజపా. బలపరీక్ష మరొకరోజు వాయిదా వేయాలని సీఎం కోరగా.. సభాపతి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవాళే జరుగుతుందని పేర్కొన్నారు. 3 గంటలకు బలపరీక్ష చేపట్టాలని భాజపా పట్టుబడుతుంది. సమయంతో సంబంధం లేకుండా.. ఓటింగ్ నిర్వహిస్తానని తెలిపారు రమేశ్ కుమార్.
12:13 July 22
బలపరీక్ష ఇవాళే: స్పీకర్
కన్నడ రాజకీయ సంక్షోభం.. మలుపులు తిరుగుతూనే ఉంది. ఈ రోజు బలపరీక్ష జరుగుతుందనుకుంటున్న తరుణంలో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. స్వతంత్ర ఎమ్మెల్యేల పిటిషన్లకు సుప్రీంలో చుక్కెదురైంది. మరోవైపు.. రెబల్స్‌కు నోటీసులు పంపారు సభాపతి.
కన్నడ అసెంబ్లీలో నేడు బలపరీక్ష.. జరిగే అవకాశాలపై అనిశ్చితి నెలకొంది. రెండు రోజుల అనంతరం... ప్రారంభమైన అసెంబ్లీలో ముఖ్యమంత్రి బలనిరూపణ జరుగుతుందని అంతా అనుకున్న తరుణంలో స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాజీనామాలు చేసిన రెబల్స్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు సభాపతి రమేశ్ కుమార్. మంగళవారం ఉదయం 11 గంటలకు తన కార్యాలయంలో కలవాల్సిందిగా ఆదేశించారు. సంకీర్ణ కూటమి నేతల ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్.
సుప్రీంలో చుక్కెదురు...
మరోవైపు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన స్వతంత్ర ఎమ్మెల్యేలిద్దరికీ చుక్కెదురైంది. కన్నడ అసెంబ్లీలో ఇవాళే.. ముఖ్యమంత్రి బలనిరూపణ చేసుకునేలా ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు స్వతంత్ర శాసనసభ్యులు శంకర్, నగేశ్. తమ పిటిషన్లపై త్వరగా విచారణ చేపట్టాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చారు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయి. రేపు విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.
బలనిరూపణపై అనుమానాలు...
ఇప్పటికే.. విప్‌పై స్పష్టత అంశంలో సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు. వీటన్నింటిపై అత్యున్నత న్యాయస్థానం.. రేపే విచారణ చేపట్టే అవకాశముంది. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు బలపరీక్ష జరగదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంకీర్ణ కూటమి కూడా విశ్వాస పరీక్షపై చర్చను సాగదీసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
11:50 July 22
స్పీకర్ నిర్ణయంతో 'బలపరీక్ష'పై అనుమానాలు..!
రెబల్ ఎమ్మెల్యేలకు సమన్లు జారీ చేశారు కర్ణాటక అసెంబ్లీ సభాపతి. మంగళవారం ఉదయం 11 గంటలకు తన కార్యాలయంలో కలవాల్సిందిగా ఆదేశించారు. సంకీర్ణ కూటమి నేతలు.. రెబల్స్‌పై అనర్హత పిటిషన్లు దాఖలు చేయగా.. స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
11:01 July 22
రెబల్స్‌కు సమన్లు జారీ చేసిన స్పీకర్
కర్ణాటక స్వతంత్ర ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కన్నడ అసెంబ్లీలో.. ఇవాళే ముఖ్యమంత్రి బలనిరూపణ చేసుకునేలా ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు శాసనసభ్యులు నగేశ్, శంకర్. త్వరగా విచారణ చేపట్టాలన్న వారి విజ్ఞప్తిని తోసిపుచ్చింది కోర్టు.
10:55 July 22
స్వతంత్ర ఎమ్మెల్యేలకు సుప్రీంలో చుక్కెదురు..
మరికాసేపట్లో అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుండగా విధానసౌధకు ఇప్పుడే చేరుకున్నారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక భాజపా అధ్యక్షుడు యడ్యూరప్ప. ఆయనతో పాటుగా పార్టీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వచ్చారు. నేడు.. విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలోని కుమారస్వామి సర్కారు.
10:35 July 22
విధానసౌధకు చేరుకున్న భాజపా ఎమ్మెల్యేలు...
-
Bengaluru: Former Karnataka CM & BJP leader BS Yeddyurappa along with BJP MLAs arrives at Vidhana Soudha. Congress-JD(S) coalition government to face floor test in Assembly today. pic.twitter.com/p6eIuaIsLH
— ANI (@ANI) July 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bengaluru: Former Karnataka CM & BJP leader BS Yeddyurappa along with BJP MLAs arrives at Vidhana Soudha. Congress-JD(S) coalition government to face floor test in Assembly today. pic.twitter.com/p6eIuaIsLH
— ANI (@ANI) July 22, 2019Bengaluru: Former Karnataka CM & BJP leader BS Yeddyurappa along with BJP MLAs arrives at Vidhana Soudha. Congress-JD(S) coalition government to face floor test in Assembly today. pic.twitter.com/p6eIuaIsLH
— ANI (@ANI) July 22, 2019
కర్ణాటక రాజకీయ సంక్షోభం.. నేడు ఒక కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా బలపరీక్ష ఈ రోజే నిర్వహించేలా చేయాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునే దిశగా విస్తృత చర్చలు జరిపాయి అధికార కూటమి పార్టీలు. కాంగ్రెస్, జేడీఎస్‌లు వేర్వేరుగా ఆదివారం.. శాసనసభా పక్ష సమావేశాలు నిర్వహించాయి. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై పదునుపెట్టాయి. విప్ అంశంపై సుప్రీంకోర్టు నుంచి స్పష్టత వచ్చే వరకు.. విశ్వాస పరీక్ష జరపకుండా కాలయాపన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
10:17 July 22
అసెంబ్లీలో మాటల దాడి..

Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************

Copyright 2013 CCTV. All rights reserved.