కర్ణాటక పర్యటక శాఖ మంత్రి సీటీ రవికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఆదివారం కొవిడ్-19 సోకినట్లు స్వయంగా ట్విట్టర్లో పేర్కొన్నారు రవి. అయితే ఆయన భార్య సహా.. సన్నిహితులకు మాత్రం పరీక్షల్లో నెగటివ్‌గా తేలింది.
'ఆదివారం వచ్చిన కరోనా ఫలితాల్లో నాకు వైరస్ సోకినట్లు తేలగా.. అదృష్టవశాత్తూ నా భార్య, తోటి సిబ్బందికి కొవిడ్ లేదని నిర్ధరణ అయింది. అయినప్పటికీ నేను బాగానే ఉన్నాను.'
- సీటీ రవి, పర్యటక శాఖమంత్రి-కర్ణాటక
అయితే తక్షణమే స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నానన్న మంత్రి.. అక్కడి నుంచే విధులు నిర్వహిస్తానని చెప్పారు. త్వరలోనే కోలుకొని వచ్చి అందరితో కలిసి పనిచేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: విమాన ప్రయాణాల్లో కరోనాపై కొత్త నిబంధన