వివాహం అంటే సాధారణంగా వరుడు, వధువుకి తాళి కడతాడు. ఇది మన భారతీయ సంప్రదాయం.కానీ ఇక్కడ వధువులు వరుడి మెడలో మంగళ సూత్రం కట్టారు.
కర్ణాటక నలత్వాద టౌన్‌కు చెందిన అంకితా, ప్రియలకు, ప్రభు రాజు, అమిత్‌లకు ఇచ్చి వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు.అయితే మగవారు తాళి కట్టే సంప్రదాయన్ని మార్చాలని ఈ జంటలు భావించాయి. ఈ విషయాన్ని పెద్దలకు తెలిపాయి. వారు దీనికి అంగీకరించారు. ప్రభురాజు మెడలో అంకిత, అమిత్ మెడలో ప్రియ తాళి కట్టారు.
ఈ కొత్త సంప్రదాయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు వధూవరుల కుటుంబ సభ్యులు. వివాహం కోసం ప్రత్యేకంగా ముహుర్తమూ నిశ్చయించలేదు పెద్దలు.