ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరుకుంది.సహాయ సిబ్బంది ఇప్పటి వరకు 56 మందిని రక్షించారు. మరో ముగ్గురు ఇంకా శిథిలాల కిందే చిక్కుకుని ఉన్నారు. వారికి ఆక్సిజన్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందిస్తున్నారు.
రెండు రోజుల నరకయాతన నుంచి విముక్తి - Karnataka
కర్ణాటక ధార్వాడ్ ఘటనలో మరో వ్యక్తిని సురక్షితంగా రక్షించారు సహాయక సిబ్బంది. నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి.... దాదాపుగా రెండురోజులకు పైనే శిథిలాల కింద జీవించాడు బాధితుడు.
రెండు రోజులు శిథిలాల కిందే నరకయాతన
కర్ణాటక ధార్వాడ్లో భవనం కూలిన ఘటనలో మరో వ్యక్తిని సురక్షితంగా రక్షించారు అధికారులు. ఈ నెల 19న దుర్ఘటన జరిగినప్పటి నుంచి శిథిలాల్లోనే బిక్కుబిక్కుమంటూ జీవనం గడిపాడు బాధితుడు. ఆహారం, నీరు లేకుండానే దాదాపు రెండురోజులకు పైగా నరకయాతన అనుభవించి ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు.
ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరుకుంది.సహాయ సిబ్బంది ఇప్పటి వరకు 56 మందిని రక్షించారు. మరో ముగ్గురు ఇంకా శిథిలాల కిందే చిక్కుకుని ఉన్నారు. వారికి ఆక్సిజన్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందిస్తున్నారు.
sample description
Last Updated : Mar 22, 2019, 11:26 AM IST