రేపు ఉదయం 10.30కు...
వాదోపవాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం రేపు ఉదయం 10.30 గంటలకు రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై తీర్పు వెలువరించనుంది. ఎమ్మెల్యేల తరఫున రోహత్గి, స్పీకర్ తరఫున సింఘ్వీ, సీఎం తరఫున రాజీవ్ ధావన్ సుదీర్ఘ వాదనలు వినిపించారు. కుమారస్వామి సర్కారు గురువారం విధానసభలో బలపరీక్ష ఎదుర్కోనుంది. ఈ తరుణంలో రేపు సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.