ETV Bharat / bharat

యడియూరప్ప కూతురికి కరోనా.. ఆసుపత్రిలో సీఎం - కరోనా వైరస్​ యడియూరప్ప

కరోనా వైరస్​ పాజిటివ్​గా తేలిన అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప.. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే ఆయన కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్​గా తేలింది.

Karnataka CM BS Yediyurappa has been admitted to the hospital for observation
కరోనాతో ఆసుపత్రిలో చేరిన కర్ణాటక ముఖ్యమంత్రి
author img

By

Published : Aug 3, 2020, 8:50 AM IST

Updated : Aug 3, 2020, 10:06 AM IST

కరోనా వైరస్​ బారినపడ్డ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్​ యడియూరప్ప.. బెంగళూరులోని మనిపాల్​ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. వైద్యుల బృందం ముఖ్యమంత్రిని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటుందని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి.

మరోవైపు యడియూరప్ప కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం ఆమె కూడా మనిపాల్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

77 ఏళ్ల యడియూరప్పకు ఆదివారం కరోనా వైరస్​ నిర్ధరణయింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్​ వేదికగా ప్రకటించారు.

ఇదీ చూడండి:- కరోనా వైరస్​ వ్యాక్సిన్​కు ముందస్తు ప్రణాళిక

Last Updated : Aug 3, 2020, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.