కర్ణాటక ప్రభుత్వం గురువారం రాష్ట్రవ్యాప్తంగా 'మాస్క్డే'ను నిర్వహించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేదిశగా.. మాస్క్‌లు, శానిటైజర్, సబ్బుతో చేతుల్ని శుభ్రపరచుకోవడం, భౌతిక దూరం పాటించే విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం.


కొవిడ్-19ను నివారించడంలో మాస్క్ ప్రాముఖ్యత తెలియజేస్తూ.. ముఖ్యమంత్రి బీఎస్ యడూయూరప్ప 'మాస్క్ డే' కార్యక్రమం చేపట్టారు. ఈ అవగాహన ర్యాలీలో భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే, శాండల్‌వుడ్ స్టార్స్, కేబినెట్ మంత్రులు సహా మరికొందరు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:గురువారం మాస్క్ డే- కరోనాపై అవగాహనే లక్ష్యం