కర్ణాటకలో మరోసారి మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలున్న నేపథ్యంలో.... జేడీఎస్ ఎమ్మెల్యేలతో సమావేశానికి ముఖ్యమంత్రి కుమారస్వామి పిలుపునిచ్చారు. రాష్టంలో ప్రభుత్వ ఏర్పాటుకు జేడీఎస్, కాంగ్రెస్ చేతులు కలిపినప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య సఖ్యత కరవైంది.
ఈక్రమంలో అధికారాన్ని కాపాడుకునేందుకు చేపట్టాల్సిన చర్యలతో పాటు, రాజకీయంగా రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, మంత్రివర్గ విస్తరణ, తదితర అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయి.
స్వతంత్ర ఎమ్మెల్యే నగేశ్, కేపీజేపీ ఎమ్మేల్యే శంకర్‌ను ఖాళీగా ఉన్న మంత్రుల స్థానాల్లోకి తీసుకొని జేడీఎస్ తరఫున భర్తీ చేయాలని కుమారస్వామి భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపైనా పార్టీ నేతలతో చర్చించనున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో 28 సీట్లలో 25 స్థానాలను గెలుచుకున్న భాజపా అధికార కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి చెరో సీటు మాత్రమే మిగిల్చింది. ఈ నేపథ్యంలో కూటమిలో అంతర్మథనం తారస్థాయికి చేరింది.
సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఇప్పటికే కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సమన్వయ కమిటీ చీఫ్ సిద్ధరామయ్యతో కుమారస్వామి పలుమార్లు చర్చలు జరిపారు.
- ఇదీ చూడండి: రాజస్థాన్‌లో దడ పుట్టిస్తున్న ఎండలు