ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లోని ఓ తపాలా కార్యాలయంలో పెద్ద పొరపాటు జరిగింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా... ఏకంగా అండర్ వరల్డ్ డాన్లు చోటా రాజన్, మున్నా భజ్రంగీ ఫొటోలున్న పోస్టల్ స్టాంప్లు ముద్రితమయ్యాయి.
కేంద్రం అమలు చేసిన 'మై స్టాంప్' పథకం ద్వారా ఇండియా పోస్ట్ కొందరికి వ్యక్తిగత పోస్టల్ స్టాంప్లు అందిస్తుంది. ఇలా ఓ వ్యక్తి... అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్, గ్యాంగ్స్టర్ మున్నా ఫోటోలతో మొత్తం 24 స్టాంపులు తయారు చేయించుకున్నాడు. వీటిని అచ్చు వేసినందుకు పోస్టు ఆఫీసుకు రూ. 600 చెల్లించాడు.
ఈ ఘటనపై స్పందించిన కాన్పూర్ పోస్టు మాస్టర్ జనరల్ వినోద్ కుమార్ వర్మ... అధికారుల తప్పిదం వల్లే ఇలా జరిగిందని అన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిని త్వరలోనే కనిపెడతామని తెలిపారు.
ఇదీ చదవండి:దేశంలో ఆరుగురికి కొత్త రకం వైరస్