కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ భువనేశ్వర్ కలితా భాజపాలో చేరారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, కాషాయ పార్టీ నేత భూపేంద్ర యాదవ్ సమక్షంలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యత్వానికి ఈనెల 5న కలిత రాజీనామా చేశారు.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే 370 అధికరణ రద్దును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ విభేదించింది. కశ్మీర్ విషయంలో భాజపాకు కలితా మద్దతిచ్చారు. కాంగ్రెస్ వైఖరిని వ్యతిరేకిస్తూ రాజ్యసభ ఎంపీ పదవితోపాటు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదించినట్లు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభలో ప్రకటించారు.