ETV Bharat / bharat

'ఏ సమయంలోనైనా మా ఇంట్లోకి వచ్చే చనువు సింధియాకుంది' - జ్యోతిరాదిత్య సింధియా

కాంగ్రెస్​కు టాటా చెప్పి భాజపాలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాపై ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ సమయంలోనైనా తన ఇంట్లోకి రాగల సాన్నిహిత్యం ఉన్న కాంగ్రెస్​ నేతల్లో సింధియా ఒకరని చెప్పారు.

rahul gandhi
రాహుల్ గాంధీ, సింధియా
author img

By

Published : Mar 12, 2020, 6:03 AM IST

Updated : Mar 12, 2020, 9:16 AM IST

'ఏ సమయంలోనైనా మా ఇంట్లోకి వచ్చే చనువు సింధియాకుంది'

ఎలాంటి సమయంలోనైనా తన ఇంట్లోకి ప్రవేశించగల కాంగ్రెస్​ నేతల్లో జ్యోతిరాదిత్య సింధియా ఒకరని చెప్పుకొచ్చారు ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ. పార్టీ నుంచి సింధియాను సస్పెండ్​ చేసిన విషయంలో అధిష్ఠానం తనతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేశారు.

rahul gandhi tweet
రాహుల్ ట్వీట్​

" కాలేజ్​లో కలిసి చదువుకున్నందున.. ఎప్పుడైనా మా ఇంట్లోకి రాగల పార్టీ నేతల్లో సింధియా కూడా ఒకరు."- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

సింధియా, కమల్​నాథ్​లు కలిసి తాను దిగిన ఓ ఫోటోను రీట్వీట్​ చేశారు రాహుల్​ గాంధీ. దీనితో పాటు లియో టాల్​స్టాయ్​ చెప్పిన ఓ సూక్తి 'సహనం, సమయం అనే ఇద్దరు అత్యంత శక్తిమంతమైన యోధులు' అని శీర్షికగా పెట్టారు.

మోదీ కుట్ర

మధ్యప్రదేశ్​లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 'అస్థిరపరచాలని' ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చూస్తున్నట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు.

సింధియా భాజపా తీర్థం

మధ్యప్రదేశ్​ కాంగ్రెస్​లో కీలక నేత అయిన జ్యోతిరాదిత్య సింధియా ఈ మంగళవారమే పార్టీ నుంచి వైదొలిగారు. జేపీ నడ్డా సమక్షంలో బుధవారం భాజపాలో చేరారు. అయితే ఆయన మద్దతుదారుల్లో 12 మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరేది లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ 15 నెలల కమల్​నాథ్ ప్రభుత్వానికి గండం పొంచి ఉంది.

ఇదీ చూడండి: భాజపాలో చేరిన కాసేపటికే సింధియాకు టికెట్

Last Updated : Mar 12, 2020, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.