ఉపాధ్యాయులు తాము బోధించే అంశాలనే కాకుండా ఇతర విషయాలపైనా విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. కేరళ కన్నూర్‌లోని శ్రీకందాపురంనకు చెందిన జునైదా ఇదే కోవకు చెందినవారు. ఎంఏఎల్పీ పాఠశాలలో కంప్యూటర్ టీచర్‌గా పని చేస్తున్న జునైదా.. తాను నేర్చుకున్న హస్తకళా విద్యను పిల్లలకు బోధిస్తుంటారు.
కాగితం, దారం, బాటిళ్ల సాయంతోనే...
మన నిత్య జీవితంలో చాలా వస్తువుల్ని ఇలా వాడి అలా పారేస్తుంటాం. అలాంటివాటితో అందమైన వస్తువులను తయారు చేస్తుంటారు జునైదా. వార్తా పత్రికలు, నూలు దారాలు, లక్క, బాటిల్ మొదలైన వాటితో ఎన్నో ఉపయుక్తమైన వస్తువులను తయారుచేస్తారు. రంగుల కాగితాలు, దారాల సాయంతో అనేక వస్తువుల్ని రూపొందిస్తారు. ఇలా ఆమె చేతుల్లోకి వెళ్లిన దేని నుంచైనా అద్భుతం ఆవిష్కృతమవ్వాల్సిందే. అంతలా అవి చూపరులను ఆకట్టుకుంటాయి. జునైదా తయారుచేసిన కాగితపు పుష్పాలు, పక్షి గూళ్లు నిజమైన వాటిని తలదన్నెలా ఉంటాయి.
'నేను ఎంఏఎల్పీ పాఠశాలలో కంప్యూటర్ టీచర్‌గా పనిచేస్తున్నాను. కాగితం, దారాలు, బాటిళ్లు వంటి వస్తువులతో ఇవన్నీ తయారుచేశాను. ఈ తయారీలో పిల్లలకు వీలైనంత సాయం చేస్తుంటాను.'
- జునైదా, ఉపాధ్యాయురాలు
ఈ ఉపాధ్యాయురాలు... తన హస్తకళా నైపుణ్యాన్ని ఇతరులకు పంచాలన్న ఆకాంక్షతో.. ప్రతి శనివారం విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తుంటారు.
ఇదీ చదవండి: చీమలు గీసిన రూపం.. 'చిండీ మాత' ఆలయం!