క్రిమినల్ కేసుల్లో విచారణపై కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు దర్యాప్తు సంస్థలకు స్వర నమూనాలు ఇచ్చే విధంగా న్యాయమూర్తులు ఆదేశాలు ఇవ్వొచ్చని స్పష్టం చేసింది.
స్వర నమూనాల అంశంపై న్యాయమూర్తులు ఆదేశాలు జారీ చేసేలా క్రిమినల్ ప్రొసిజర్ కోడ్లో ఎలాంటి నిబంధన లేదని పేర్కొంది. కానీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద న్యాయమూర్తులకు ప్రత్యేక అధికారాలు కట్టబెడుతున్నట్లు జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.
ఇదీ చూడండి: ఆగస్టు 6 నుంచి అయోధ్యపై రోజువారీ విచారణ