ఉత్తర్‌ప్రదేశ్‌లోని మరో 29 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ. సీనియర్ నేత మురళీ మనోహర్ జోషికి టికెట్ కేటాయించలేదు. ఆయన 2014లో కాన్పూర్ స్థానం నుంచి గెలుపొందారు.
సీట్ల మార్పు..
కేంద్ర మంత్రి మేనకా గాంధీ, ఆమె కుమారుడు ఎంపీ వరుణ్ గాంధీ స్థానాలను పరస్పరం మార్చింది. ఒకరి స్థానంలో మరొకరు పోటీ చేయనున్నారు.
ప్రస్తుతం మేనకా గాంధీ సుల్తానాపూర్ నియోజకవర్గానికి, వరుణ్ గాంధీ ఫిలిబిత్ నియోజకవర్గానికి ఎంపీలుగా ఉన్నారు.
జయప్రదకు రామ్‌పూర్..
మంగళవారమే పార్టీలో చేరిన ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు రామ్‌పూర్ లోక్‌సభ స్థానాన్ని కేటాయించింది భాజపా.
కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా సిట్టింగ్ స్థానమైన ఘాజీపూర్ నుంచి పోటీ చేయనున్నట్లు భాజపా కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు.
రీటా బహుగుణ జోషి అలహాబాద్ నుంచి, సత్యదేవ్ పచౌరీ కాన్పూర్ నుంచి బరిలో దిగనున్నట్లు తెలిపారు.
అగ్రనేతలకు టికెట్ నిరాకరణ
2014 ఎన్నికల్లో కాన్పూర్ నుంచి గెలుపొందిన సీనియర్ నేత మురళి మనోహర్ జోషి భాజపా టికెట్ నిరాకరించింది. ఆయనతో పాటు పార్టీ అగ్రనేత ఎల్.కె.అడ్వాణీ, మరో సీనియర్ నేత బి.సి.కందూరీ కల్రాజ్ మిశ్రాలకు కూడా అధిష్టానం టికెట్ ఇవ్వలేదు.