ETV Bharat / bharat

దారుణం: మూక దాడిలో యువకుని మృతి

ఝార్ఖండ్‌లోని ఖార్సావన్ జిల్లాలో దొంగతనం నెపంతో 24 ఏళ్ల యువకుడిని బంధించి చిత్రహింసలు పెట్టారు. జైశ్రీరాం, జై హనుమాన్​ అనాలంటూ గంటలపాటు చితకబాదగా ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది ఝార్ఖండ్​ ప్రభుత్వం.

author img

By

Published : Jun 24, 2019, 7:33 PM IST

దారుణం: మూక దాడిలో యువకుని మృతి
యువకునిపై మూక దాడి

ఝార్ఖండ్​లోని ఖార్సావాన్​ జిల్లాలో దారుణం జరిగింది. మోటారు సైకిల్​ దొంగలించాడనే అనుమానంతో 24 ఏళ్ల ముస్లిం యువకుడు తాబ్రేజ్‌ అన్సారీని కొందరు మూకుమ్మడిగా కొన్ని గంటలపాటు చితకబాదారు. ఆ తర్వాత జైశ్రీరామ్, జై హనుమాన్​ అనాలంటూ చావగొట్టారు. దెబ్బలు తట్టుకోలేక చికిత్స పొందుతూ అన్సారీ ప్రాణాలు కోల్పోయాడు. జూన్​ 18 రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇంటికి వెళుతుండగా..

ఆ రోజు జంషెడ్​పుర్​ నుంచి ఇంటికి స్నేహితులతో కలిసి వస్తున్న అన్సారీని, మరికొందరు స్నేహితులను మోటారు సైకిల్​ దొంగలించాడని ధాట్​కిదీ గ్రామస్థులు కొందరు అడ్డగించారు. స్నేహితులు ఎలాగోలా తప్పించుకున్నా.. అన్సారీ తప్పించుకోలేకపోయాడు. దొరికిన అన్సారీని చిత్రహింసలు పెట్టారు. కొన్ని గంటలపాటు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు.

వేడుకున్నా కనికరించలేదు

తనను వదిలేయమనీ ఎంత వేడుకున్నా ఫలితం లేకపోయింది. జై హనుమాన్ అనాలంటూ కొన్ని గంటలపాటు చావగొట్టి.. చివరకు పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలతో ఉన్న అన్సారీని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి జంషెడ్​పుర్​లోని టాటా ఆసుపత్రిలో చేర్చగా జూన్​ 22న అన్సారీ మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.

ఈ కేసుకు సంబంధించి పప్పు మండల్ అనే యువకుణ్ని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కార్తీక్​ తెలిపారు.

ఇదీ చూడండి: చిన్నారులు క్షేమం.. కందకం నుంచి బయటకు తీసిన సిబ్బంది

Intro:Body:

rt

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.