ETV Bharat / bharat

జమ్ము కశ్మీర్​లో టోల్​ ఛార్జీ వసూళ్లు రద్దు - latest national news

జమ్ము-పఠాన్​కోట్​ రహదారి వెంబడి ఉన్న టోల్​ పోస్ట్​లను రద్దు చేసినట్లు ప్రకటించింది జమ్ముకశ్మీర్​ పరిపాలన విభాగం. నూతన సంవత్సరం నుంచి ఈ ప్రక్రియ అమలులోకి రానున్నట్లు తెలిపింది.

jk toll
టోల్​ చార్జీ రద్దు
author img

By

Published : Jan 1, 2020, 6:04 AM IST

జమ్ము కశ్మీర్​లో ప్రయాణించే వాహనదారులకు ఊరటనిస్తూ కొత్త నిర్ణయం తీసుకుంది అక్కడి పరిపాలన విభాగం. జమ్ము-పఠాన్​కోట్​ రహదారి వెంబడి ఉన్న లఖన్​పూర్​తో సహా ఇతర టోల్​ పోస్ట్​లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియ నూతన సంవత్సరం 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్లు ప్రణాళిక,పర్యవేక్షణ, అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి రోహిత్​ కంసల్​ మీడియా సమావేశంలో ప్రకటించారు. దీని వల్ల ఏడాదికి రూ.1500కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోతామని పేర్కొన్నారు.

స్థానిక పరిశ్రమల పోటీతత్వాన్ని మెరుగుపరిచేందుకు, తగిన సూచనలు ఇవ్వడానికి వివిధ వాటదారులతో చర్చలు జరుపుతామని తెలిపారు రోహిత్​ కంసల్. ఇందుకోసం ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయించిదని వెల్లడించారు.

"2020జనవరి 1వ తేదీ నుంచి లఖన్​పూర్​, విమానాశ్రాయాలు, రైల్వే స్టేషన్స్​తో సహా ఇతర పోస్టులు వద్ద టోల్​ ఛార్జీల వసూళ్లను రద్దు చేశాం. ఈ టోల్​ ఛార్జీలు రద్దు చేయడం వల్ల ఏడాదికి రూ.1500కోట్ల ఆదాయం నష్టం వాటిల్లతోంది."

-రోహిత్​ కంసల్​, ప్రణాళిక,పర్యావేక్షణ, అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి.

2018 ఫిబ్రవరి 6న అనంతనాగ్ జిల్లాలోని జమ్ము-శ్రీనగర్ రహదారి వెంబడి లోయర్ ముండా వద్ద , షోపియన్ జిల్లాలోని మొఘల్ రహదారి వెంబడి బోరెహల్లన్-హీర్పూర్ వద్ద రెండు ప్రధాన టోల్ పోస్టులను రద్దు చేసింది అప్పటి జమ్ముకశ్మీర్ ప్రభుత్వం.

ఆందోళన..

ఈ టోల్​ ఛార్జీల ఉపసంహరణ నిర్ణయాన్ని వ్యాపారులు ఆమోదించినప్పటికీ...పారిశ్రామికవేత్తలు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి పారిశ్రామిక రంగాన్ని 'బ్లాక్​ డేత్​ వారెంట్'​గా అభివర్ణించారు.

ఇదీ చూడండి : 'ఆర్​పీఎఫ్'​కు గ్రూప్​- ఏ హోదా కల్పిస్తూ పేరు మార్పు

Mumbai, Dec 31 (ANI): While speaking to ANI in Mumbai on Kerala Assembly passed resolution demanding withdrawal of the Citizenship Amendment Act (CAA), the Congress leader Mohammad Arif Naseem Khan said, "We welcome this decision by Kerala government, all state governments, including the Thackeray government in Maharashtra should call a session of assembly, asking the central government to withdraw Citizenship Amendment Act."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.