ETV Bharat / bharat

భీకర వర్షాలు, పిడుగులకు 12 మంది బలి - వర్షాలు

ఉత్తరాదిన వర్షాలు ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఝార్ఖండ్​లో పిడుగులకు 12 మంది బలయ్యారు. మరో 11 మంది తీవ్రగాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు.

Jharkhand: Rains leave 12 dead, 11 injured in 24 hours
భీకర వర్షాలు.. పిడుగులకు 12 మంది బలి
author img

By

Published : Jul 10, 2020, 1:25 PM IST

ఝార్ఖండ్​లో 24 గంటల్లో వేర్వేరు చోట్ల పిడుగులు పడిన ఘటనల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

గిరిడీ​ జిల్లా బర్నీ, అరారా ప్రాంతాల్లో మహిళ సహా ముగ్గురు చనిపోయారు. లోహర్​దగ్గా జిల్లాలో ఇద్దరు వ్యక్తులు పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు చిన్నారులు తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

జూన్​ 26న పలాము జిల్లాలో పిడుగుల కారణంగా నలుగురు మరణించారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి.

బిహార్​, ఉత్తర్​ప్రదేశ్​లోనూ పిడుగులకు ఇటీవల 100 మందికిపైగా బలయ్యారు.

ఇదీ చూడండి: పిడుగుపాటుకు ఒక్కరోజులో 83 మంది బలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.