జార్ఖండ్‌లోని డుమ్కాలో నక్సల్స్, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సశస్త్ర సీమా బల్ జవాను ఒకరు మృతి చెందారు. మరో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి. కాల్పుల్లో నలుగురు నుంచి ఐదుగురు నక్సల్స్ మృతి చెంది ఉంటారని సమాచారం అందిందని ఎస్పీ రమేశ్ తెలిపారు.
తెల్లవారు జాము 3.30 తల్దంగల్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా నక్సల్స్ కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా దళాలు దీటుగా సమాధానమిచ్చాయి.
గాయపడిన జవాన్లలో ముగ్గురిని చికిత్స కోసం డుమ్కా ఆసుపత్రికి, మరొకరిని రాంచీకి తరలించారు.