ETV Bharat / bharat

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్​ పదవికి​ హరివంశ్​ నామినేషన్​ - రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్​ ఎన్నిక

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్​ ఎన్నిక నేపథ్యంలో ఎన్​డీఏ అభ్యర్థి, జేడీయూ ఎంపీ హరివంశ్​ నామినేషన్​ దాఖలు చేశారు. విపక్షాల అభ్యర్థిగా డీఎంకే ఎంపీ తిరుచ్చి శివను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

RS DC NOMINATION
హరివంశ్​
author img

By

Published : Sep 9, 2020, 12:34 PM IST

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవికి జేడీయూ ఎంపీ హరివంశ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే డిప్యూటీ ఛైర్మన్​గా కొనసాగుతున్న హరివంశ్​నే జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్​డీఏ) మళ్లీ బలపరిచింది.

పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభమయ్యే సెప్టెంబర్​ 14న డిప్యూటీ ఛైర్మన్​ ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించి నామినేషన్ల గడువు సెప్టెంబర్​ 11తో ముగియనుంది.

విపక్షాల అభ్యర్థిగా శివ!

ఈ నేపథ్యంలో విపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిగా డీఎంకే ఎంపీ తిరుచ్చి శివను నిలబెట్టాలని భావిస్తున్నాయి. ఈ మేరకు ఓ సీనియర్ ప్రతిపక్ష నేత వెల్లడించారు. అయితే, ఆయన సెప్టెంబర్​ 10న దిల్లీ వచ్చిన తర్వాత ఈ విషయంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఇప్పటివరకు శివ.. నాలుగు సార్లు రాజ్యసభకు, ఒకసారి లోక్​సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ​

ఇదీ చూడండి: డిప్యూటీ ఛైర్మన్​ ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.