ETV Bharat / bharat

'ఉగ్రవాదాన్ని అంతం చేయాలి' - dehradun

ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సీఆర్పీఎఫ్​ జవాన్ మోహన్​లాల్​ కుటుంబం కోరుతోంది. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని పిలుపునిచ్చింది. అమరజవాన్ మోహన్​లాల్ కుటుంబసభ్యులను ఈటీవీ భారత్​ ప్రతినిధి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు.

శంకర్​ రాటూరి
author img

By

Published : Mar 7, 2019, 11:32 PM IST

పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్​ మోహన్​లాల్ రాటూరి కుటుంబం బాలాకోట్ వాయుదాడులపై స్పందించింది. ఇది సరిపోదని, పూర్తిగా ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలని కోరారు మోహన్ కుటుంబసభ్యులు. అదే తమ తండ్రి మరణానికి అసలైన నివాళి అంటూ రాటూరి పిల్లలు తమ మనోగతాన్ని ఈటీవీ భారత్​ ప్రతినిధికి వినిపించారు.

జవాను కుటుంబం

ప్రశ్న: వాయుదాడులతో పుల్వామా ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకున్నామని మోదీ ప్రభుత్వం చెబుతోంది. మీరేమంటారు?
జ​: ఒక్క వాయుదాడితో ప్రతీకారం తీర్చుకున్నట్లు కాదు. మొత్తం ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టినప్పుడే అమర జవాన్లకు నిజమైన నివాళి.

ప్రశ్న: ఉగ్రదాడులను రాజకీయ పార్టీలు వివాదాస్పదం చేస్తున్నాయి. వాటిని ఎలా చూస్తున్నారు?
జ​: ఇటువంటి పరిస్థితులను రాజకీయంగా వాడుకోవటం అనేది ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు.

ప్రశ్న: వాయుదాడితో మీ తండ్రి మరణానికి ప్రతీకారం తీరినట్టేనా? మీరు ఇంకేమైనా కోరుకుంటున్నారా?
జ: ఉగ్రవాదులది ఎంతో పెద్ద సముదాయం. దీనితోనే పూర్తయినట్టు కాదు. ఎంతో కొంత వారి సంఖ్య తగ్గుతుంది. మొన్న దాడుల్లో 300 మంది మరణించారని అంటున్నారు. ఈ సంఖ్య ఒక్క శాతం ఉండొచ్చు. ఇలాగే భారత్​ దాడులు చేస్తుంటే ఉగ్రవాదం నశించే అవకాశం ఉంది.

ప్రశ్న: ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను రాజకీయంగా వాడుకుంటున్నారు. మీకేమనిపిస్తోంది?
జ: రాజకీయ ప్రభావం ఉన్నా లేకున్నా ఫర్వాలేదు. ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రజల మనోభావాలను రాజకీయం చేయటమనేది సహించలేం.

ప్రశ్న:మోదీ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు?
జ: ఈ విషయంలో మోదీ పనితీరు బాగుంది. సైనికులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సీఆర్పీఎఫ్​ డీఐజీ లాంటి వాళ్లు సైతం అప్పుడప్పుడు వచ్చి మా యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు.

New Delhi, March 07 (ANI): Alexandre Ziegler, French Envoy to India reiterated on pushing designation of Pakistan-based terrorist outfit Jaish-e-Mohhamed (JeM) Masood Azhar as global terrorist at UNSC. "We believe there should be no tolerance of terror. So yes we will push for designation of Masood Azhar as global terrorist, at UNSC, have been pushing for it for past 2 years as well. Not designating him doesn't make sense", said Ambassador Alexandre Ziegler. JeM claimed responsibility for dastardly suicide bomb attack on CRPF convoy in Pulwama, which claimed live of over 40 CRPF personnel.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.