ETV Bharat / bharat

కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు 'జనతా కర్ఫ్యూ'

ప్రపంచాన్ని హడలెత్తిస్తోన్న కరోనాను కట్టడి చేసేందుకు ఇళ్లకే పరిమితమవ్వాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు యావత్ భారతం జనతా కర్ఫ్యూ పాటిస్తోంది. వీధులన్నీ బోసిపోయాయి. రోడ్లపై వాహనాల రాకపోకలు చాలా స్వల్పంగా ఉన్నాయి. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి అత్యవసర సేవలు మినహా దుకాణాలు, షాపింగ్‌మాళ్లు, థియేటర్లు మూతపడ్డాయి.

JantaCurfew
కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు 'జనతా కర్ఫ్యూ'
author img

By

Published : Mar 22, 2020, 10:38 AM IST

కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రజలు జనతా కర్ఫ్యూను పాటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు స్పందించిన జనం ఇళ్లకే పరిమితమయ్యారు. వీధులన్నీ బోసిపోయాయి. దుకాణాలు తెరుచుకోలేదు. రహదారులపై వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి.

నగరాలన్నీ బంద్...

వారణాసి, లఖ్‌నవూ, అహ్మదాబాద్‌, కొచ్చి, తిరువనంతపురం, చండీగఢ్‌, పట్నా, కోల్‌కతా, ముంబయి, నాగపుర్‌, లుథియానా, చెన్నై తదితర నగరాల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికులు లేక వెలవెలపోతున్నాయి.

బస్సు సర్వీసులు లేవు...

జనతా కర్ఫ్యూలో భాగంగా హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, రాజస్థాన్‌లో బస్సు సర్వీసులు నిలిపేశారు. ముంబయి, హైదరాబాద్‌లో మెట్రో రైళ్లను నిలిపేశారు.

అత్యవసర సేవలు మాత్రమే...

దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్బులు, బార్‌లు మూతపడ్డాయి. అత్యవసర సేవలు మినహా ఏ దుకాణం తెరుచుకోలేదు.

ఆయా రాష్ట్రాల్లో ఇలా...

JANATHHA
ఉత్తర్​ప్రదశ్​ గోరఖ్​పుర్​
JANATHHA
తిరువనంతపురం, కేరళ
JANATHHA
హుబ్లీ, కర్ణాటక
JANATHHA
హుబ్లీ, కర్ణాటక
JANATHHA
సోలాన్​, హిమాచల్​ ప్రదేశ్​
JANATHHA
హుబ్లీ, కర్ణాటక
  1. రాజస్థాన్‌లో అత్యవసరాలు మినహా పూర్తిస్థాయి బంద్‌కు అశోక్​ గహ్లోత్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.
  2. ఒడిశాలో 5 జిల్లాలు, 8 పట్టణాల్లో వారం రోజులు పూర్తి బంద్‌ పాటిస్తున్నారు.
  3. పంజాబ్‌లోని 4 జిల్లాల్లో 3 రోజులు లాక్‌డౌన్‌ కొనసాగనుంది.
  4. బిహార్‌లో ఇవాళ పూర్తిగా... రేపటి నుంచి 31 వరకు పాక్షిక బంద్‌ కొనసాగనుంది.
  5. గుజరాత్‌లోని సూరత్‌, అహ్మదాబాద్‌, వడోదర, రాజ్‌కోట్‌లో అత్యవసర దుకాణాలు మినహా మూడు రోజులు అన్నీ మూసేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
  6. గోవా, దిల్లీలోని అన్ని చర్చిల్లో సామూహిక ప్రార్థనలు రద్దు చేశారు.
  7. కశ్మీర్‌లోని మసీదుల్లో ప్రార్థనలు నిలిపేస్తున్నట్లు వక్ఫ్ బోర్డు ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.