జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసి బుధవారానికి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో అనంతనాగ్ జిల్లాలోని లాల్‌చౌక్ వద్ద జాతీయ జెండాను ఎగరవేశారు భాజపా మహిళా నేత రూమిసా రఫీక్. అనంతరం త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేశారు.
ఇదీ చూడండి:- 370 రద్దు: కేంద్రం హామీలకు భిన్నంగా వాస్తవాలు!
జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా కర్ఫ్యూ తరహా ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఆంక్షలు ముఖ్యంగా కరోనా వైరస్ నియంత్రణకేనని అధికారులు చెబుతున్నారు.
జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా విస్తృతంగా బలగాలను మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా శ్రీనగర్ జిల్లాలో పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు గస్తీ కాస్తున్నాయి. లోయలో అశాంతిని నెలకొల్పాలన్న వేర్పాటువాదుల ప్రణాళికల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్టు అధికారులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి:-