ETV Bharat / bharat

కేంద్ర జల్​ శక్తి మంత్రికి కరోనా పాజిటివ్​ - Gajendra Singh Shekhwat tweets

దేశంలో కొవిడ్​-19 బారినపడిన ప్రముఖుల వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కొత్తగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​కు వైరస్ సోకింది.

Jal Shakti Minister Gajendra Singh Shekhwat tests positive for coronavirus
కేంద్ర జల్​ శక్తి మంత్రికి కరోనా పాజిటివ్​
author img

By

Published : Aug 20, 2020, 3:37 PM IST

కరోనా బారినపడిన ప్రముఖుల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా కేంద్ర జల్‌ శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

Jal Shakti Minister Gajendra Singh Shekhwat tests positive for coronavirus
గజేంద్ర సింగ్​ షెకావత్​ ట్వీట్​

వైరస్‌ లక్షణాలు కనిపించినందున నిర్ధరణ పరీక్షలు చేయించుకోగా.. తనకు పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు షెకావత్​. వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రిలో చేరారని చెప్పారు. కొన్ని రోజులుగా తనకు సన్నిహితంగా మెలిగిన వారందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని కోరిన మంత్రి.. లక్షణాలు ఉన్న వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఈ నెల 18న షెకావత్‌ నేతృత్వంలో సట్లేజ్‌ - యమున సంధానంపై ఓ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరియాణా ముఖ్యమంత్రి ఎమ్‌ఎల్‌ ఖట్టర్‌ సహా.. మరికొందరు సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కాస్త మెరుగుపడిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.