ETV Bharat / bharat

ఒక్క ఏడాదిలో 5 కోట్ల ఇళ్లకు కుళాయి నీరు

జల జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఐదు కోట్ల ఇళ్లకు కుళాయి నీరు అందించింది కేంద్రం. గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం నాడు మోదీ ప్రకటించిన ఈ పథకం ద్వారా 2024 నాటికి మొత్తం 18.933 కోట్ల ఇళ్లకు నీరు అందించాలన్నది లక్ష్యం. లాక్​డౌన్ ఉన్న సమయంలో లక్ష కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. లాక్​డౌన్​తో గ్రామాలకు చేరుకున్న వలస కార్మికులతోనే ఈ పథకం పనులు ఎక్కువగా చేయించారు.

Jal Jeevan Mission: Nearly 5 crore houses get tap connection in one year
ఒక్క ఏడాదిలో 5 కోట్ల ఇళ్లకు కుళాయి నీరు
author img

By

Published : Aug 14, 2020, 11:08 AM IST

దేశంలో ప్రతి ఇంటికి కుళాయి నీటిని అందించేందుకు ప్రారంభించిన 'జల్ జీవన్ మిషన్' పథకం ఇప్పటివరకు 5 కోట్ల ఇళ్లకు చేరింది. గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రకటించారు.

ప్రతి వ్యక్తికి రోజుకు కనీసం 55 లీటర్ల నీటిని అందించేలా రూ.3.55 లక్షల కోట్లు ఇందుకు కేటాయించారు. ఈ పథకం కింద కొత్త కుళాయి కనెక్షన్లు ఇవ్వటం, ఇప్పటికే ఉన్న పాత కనెక్షన్లను మెరుగ్గా మార్చడం, గ్రామాల్లో నీటి వనరులను ఏర్పాటు చేయటం వంటి పనులు చేపట్టారు. 2024 నాటికి మొత్తం 18.933 కోట్ల ఇళ్లకు నీరు అందించాలన్నది లక్ష్యం కాగా.. మొదటి ఏడాదిలో4.946 కోట్ల ఇళ్లకు ఇచ్చినట్టు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు 'ఈటీవీ భారత్' కు చెప్పారు.

దక్షిణాదిలో ప్రారంభం

దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ పథకం అమలుకి ఉత్సాహం చూపుతున్నాయి. 66.21 లక్షల కనెక్షన్లతో ఈ పథకం వినియోగంలో గుజరాత్ తొలిస్థానంలో నిలిచింది. 53.88 లక్షల కనెక్షన్లతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. హిమాచల్​ ప్రదేశ్, పంజాబ్​, హరియాణా ఆ తర్వాత ఉన్నాయి.

దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పథకం కింద ఇప్పుడిప్పుడే పనులు ప్రారంభమయ్యాయి. దేశంలో లాక్​డౌన్ ఉన్న సమయంలోనూ మార్చి నుంచి జల్ జీవన్ మిషన్ కింద లక్ష కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. లాక్​డౌన్​తో గ్రామాలకు చేరుకున్న వలస కార్మికులతోనే ఈ పథకం పనులు ఎక్కువగా చేయించారు.

ఇదీ చదవండి- కరోనా విజృంభణ: 64,553 కేసులు, 1007 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.