ETV Bharat / bharat

పాక్​ కవ్వింపు చర్యలు.. ఇద్దరు భారత జవాన్లు మృతి - soldiers

జమ్ముకశ్మీర్​ నియంత్రణ రేఖ వెంబడి పాక్​ ఉగ్రచర్యలకు పాల్పడుతూనే ఉంది. రాంపుర్​ సెక్టార్​లో శుక్రవారం పాక్​ సైన్యం జరిపిన కాల్పుల్లో గాయపడ్డ ఇద్దరు జవాన్లు ఇవాళ మరణించారు. మరోవైపు పుల్వామా జిల్లా దంగెర్​పొరా వద్ద భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

J-K: Two soldiers injured in Pak firing along LoC succumb
పాక్​ కవ్వింపు చర్యలు.. ఇద్దరు భారత జవాన్లు మృతి
author img

By

Published : May 2, 2020, 9:54 AM IST

కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తూ... తన వక్రబుద్ధిని చాటుకుంటోంది పాకిస్థాన్​. దాయాది దళాలు బారాముల్లా జిల్లా రాంపుర్​ సెక్టార్​ వద్ద శుక్రవారం కాల్పులు జరిపాయి. ఆ ఘటనలో గాయపడ్డ ఇద్దరు జవాన్లు ఇవాళ ప్రాణాలు కోల్పోయారు. ఎదురుకాల్పుల్లో మొత్తం ముగ్గురు సిబ్బంది, ముగ్గురు పౌరులు గాయపడ్డారు. ఇందులో నాలుగేళ్ల బాలుడు కూడా ఉన్నాడు.

అక్కడ ఎన్​కౌంటర్​..

మరోవైపు.. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.

దంగెర్​పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు.. నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. ముందే పసిగట్టిన ముష్కరులు కాల్పులు జరపగా.. ఎన్​కౌంటర్​కు దారితీసింది. అప్రమత్తమైన భారత సైన్యం.. దీటుగా బదులిస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.