ETV Bharat / bharat

పాక్​కు మరోసారి గట్టి కౌంటర్​ ఇచ్చిన భారత్​

భారత్​లో కశ్మీర్​ ఎప్పటికీ అంతర్భాగమేనని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి సమావేశంలో విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్​ తేల్చిచెప్పారు. కశ్మీర్​ అంశంలో పాకిస్థాన్​ జోక్యాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.

author img

By

Published : Feb 26, 2020, 7:35 PM IST

Updated : Mar 2, 2020, 4:12 PM IST

J&K was, is and shall forever remain India's integral part
'జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారత్​లో అంతర్భాగమే'

జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని విదేశాంగ కార్యదర్శి వికాస్‌ స్వరూప్‌ ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి సమావేశంలో పునరుద్ఘాటించారు. మంగళవారం జరిగిన సదస్సులో కశ్మీర్‌ అంశంలో పాక్‌ జోక్యాన్ని తీవ్రంగా ఆక్షేపించారు స్వరూప్‌. అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాకిస్థాన్ కేంద్రబిందువుగా మారిందని విమర్శించారు. స్విట్జర్‌లాండ్‌లో జరుగుతున్న 43వ మానవ హక్కుల మండలి సమావేశంలో ప్రసంగించిన ఆయన... ఉగ్రవాదులకు ఆశ్రయం, ఆర్థిక ఊతం అందిస్తున్న దేశాలపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని సభ్యదేశాలకు పిలుపునిచ్చారు.

కశ్మీరీ ప్రజల మానవ హక్కులను భారత్ హరిస్తోందన్న పాక్ మానవ హక్కుల మంత్రి షిరీన్ మజారి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఎండగట్టారు వికాస్​. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలని పాక్‌ చూస్తోందని దుయ్యబట్టారు. ఆర్టికల్‌ 370 రద్దు భారత్ అంతర్గత అంశమన్నారు. కశ్మీర్‌ భారత్‌లో భాగమనే వాస్తవాన్ని పాక్‌ అంగీకరించాలని హితవు పలికారు. భారత్​పై వ్యతిరేక ప్రచారాన్ని మానుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి: భారత్​-అమెరికా మధ్య కుదిరిన ఒప్పందాలివే..

Last Updated : Mar 2, 2020, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.