జమ్ముకశ్మీర్ శ్రీనగర్ సీఆర్పీఎఫ్కు చెందిన ఓ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకున్నాడు. ఈ ఘటనలో సదరు అధికారి తీవ్రంగా గాయపడ్డాడు.
"ఈ రోజు ఉదయం సీఆర్పీఎఫ్ 141వ బెటాలియన్‌కు చెందిన ఇన్స్పెక్టర్ ఎం. దామోదర్ శ్రీనగర్ షెర్గారి ప్రాంతంలోని యూనిట్ వద్ద సర్వీస్ రైఫిల్‌తో తనను తాను కాల్చుకున్నాడు" అని సీఆర్పీఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు.
తుపాకీ కాల్పుల శబ్దం వినిపించగానే అప్రమత్తమైన అధికారులు.. తనిఖీ చేయగా రక్తపు మడుగులో పడి ఉన్న దామోదర్‌ను గుర్తించారు. వెంటనే అతడిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. కొంతకాలంగా ఆ అధికారి వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు.
మరో ఘటన...
సరిగ్గా నెల రోజుల క్రితం శ్రీనగర్ డాల్గేట్ ప్రాంతంలోనూ ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. సీఆర్పీఎఫ్ 61వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ కూడా ఇలానే తన సర్వీస్ రైఫిల్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇదీ చూడండి:తమ్ముడితో వాగ్వాదం- 25 అంతస్థుల భవనంపై అక్క సాహసం