ETV Bharat / bharat

ఈ ఏడాది ఆంక్షలతో అమర్​నాథ్​ యాత్ర - Jammu and Kashmir administration

ఈ ఏడాది అమర్​నాథ్​ యాత్రకు ఆంక్షలతో భక్తులను పరిమిత సంఖ్యలోనే అనుమతించనున్నట్లు జమ్ముకశ్మీర్​ పాలన యంత్రాంగం వెల్లడించింది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే యాత్రను 15 రోజులే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

J&K admin plans to undertake 'restricted' Amarnath yatra this year
ఈ ఏడాది ఆంక్షలతోనే అమర్​నాథ్​ యాత్ర
author img

By

Published : Jul 5, 2020, 5:26 AM IST

Updated : Jul 5, 2020, 6:56 AM IST

ఈ సంవత్సరం అమర్​నాథ్​ యాత్ర ఆంక్షల నడుమ జరుగనుంది. పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించనున్నారు. రోడ్డు మార్గం ద్వారా రోజుకు 500 మందిని మాత్రమే మహా శివుడికి ప్రతిరూపమైన సహజసిద్ధ మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు అవకాశం కల్పించనునట్లు జమ్ముకశ్మీర్ పాలన యంత్రాంగం తెలిపింది.

అమర్​నాథ్​ యాత్ర జూన్​ 23న ప్రారంభమై 42 రోజుల పాటు జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తితో ఆలస్యమైంది. ఈ క్రమంలోనే యాత్ర జులై చివరి వారంలో ప్రారంభమై 15 రోజులే జరుగనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు అమర్‌నాథ్‌ దేవాలయ బోర్డు అధికారులు వెల్లడించారు.

యాత్ర నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఉప కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో భద్రత సహా తీర్థయాత్ర ఏర్పాట్లను సమీక్షించినట్లు ఓ అధికార ప్రతినిధి తెలిపారు.

ఇదీ చూడండి: 'కరోనా వ్యాక్సిన్​.. ఈ ఏడాది కష్టమే'

Last Updated : Jul 5, 2020, 6:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.