మే-జూన్ నెలల్లో సరిహద్దు ప్రాంతమైన గల్వాన్ లోయలో చైనా బలగాలను దీటుగా ఎదుర్కొన్న ఇండో టిబెట్ సరిహద్దు పోలీస్ (ఐటీబీపీ) దళాలకు చెందిన 21 మంది సైనికులకు పరాక్రమ అవార్డు ప్రధానం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది ఐటీబీపీ. ప్రాణాలు పోతున్నప్పటికీ వారంతా శత్రు సైనికులకు సమర్థంగా సమాధానం ఇచ్చారని కొనియాడింది.
"ఇరు దేశాల సైనికల మధ్య జరిగిన ఘర్షణల్లో తమను తాము రక్షించుకోవటమే కాకుండా, శత్రు సైనికులతో వీరోచితంగా పోరాడారు. అంతేకాకుండా గాయపడిన సైనికులను సురక్షితంగా వెనక్కు తీసుకువచ్చారు. ఐటీబీపీ దళాలు రాత్రంతా పోరాడినప్పటికి శత్రు సైనికులు రాళ్లతో దాడిచేయటం వల్ల కొంత మంది వీరమరణం పొందారు. వారిని దీటుగా ప్రతిఘటించటం వల్ల అనేక సమస్యాత్మక ప్రాంతాలు భద్రంగా ఉన్నాయి." అని ప్రకటనలో పేర్కొంది ఐటీబీపీ.
మరోవైపు.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డీజీ స్థాయికి చెందిన 294 మంది అధికారులకు ప్రశంస పత్రాలను, బిరుదులను అందజేశారు. వీరిలో ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్ దేస్వాల్ కూడా ఉన్నారు. వీరితో పాటు ఛత్తీస్గఢ్ యాంటీ నక్సల్ ఆపరేషన్స్‌లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన మరో ఆరుగురు ఐటీబీపీ సిబ్బందికి కూడా ఈ సందర్భంగా అవార్డులను ప్రదానం చేశారు.
కొవిడ్-19 కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో అంకితభావంతో సేవ చేసిన 318 ఐటీబీపీ సిబ్బంది, 40 ఇతర కేంద్ర సాయుధ పోలీసు దళాల (సిఏపీఎఫ్) సిబ్బంది పేర్లను కూడా కేంద్ర హోంమంత్రి ప్రత్యేక ఆపరేషన్ మెడల్స్కు సిఫార్సు చేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి విశ్వాస పరీక్షలో నెగ్గిన గహ్లోత్ సర్కార్