ETV Bharat / bharat

ఎన్నికల వేళ ఉత్తరాదిన ఐటీ దాడుల కలకలం - it

ఎన్నికల వేళ మధ్యప్రదేశ్, దిల్లీలో ఆదాయ పన్ను శాఖ భారీ స్థాయిలో సోదాలు నిర్వహించింది. మధ్యప్రదేశ్ సీఎం మాజీ ప్రత్యేక అధికారి, సలహాదారు ఇళ్లపై దాడులు చేసింది. భోపాల్​లో భారీగా నగదు పట్టుకున్నట్లు సమాచారం. ఈ దాడులపై భాజపా, కాంగ్రెస్​ నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు.

ఉత్తరాన ఐటీ దాడుల కలకలం
author img

By

Published : Apr 8, 2019, 12:20 AM IST

Updated : Apr 8, 2019, 9:54 AM IST

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్​నాథ్​ సన్నిహితులపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. పన్ను ఎగవేత, హవాలా ఆరోపణలతో దిల్లీ, మధ్యప్రదేశ్​ (భోపాల్, ఇండోర్)లో కమల్​నాథ్​ సంబంధీకుల ఇళ్లలో సోదాలు చేసినట్టు అధికారులు తెలిపారు.

ఉత్తరాన ఐటీ దాడుల కలకలం

మొత్తం 52 ప్రదేశాల్లో 200 మంది సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. తనిఖీల్లో సుమారు 10 నుంచి 14 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ అధికారులు తెలిపారు. దాడులకు సంబంధించి వివరాలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, దిల్లీ ఎన్నికల సంఘానికి తెలియజేసినట్టు సమాచారం.

మధ్యప్రదేశ్ సీఎం కమల్​నాథ్​ మాజీ ప్రత్యేక అధికారి ప్రవీణ్​ కక్కడ్, మాజీ సలహాదారు రాజేంద్ర మిగ్లానీ, ఆయన బంధువు రతుల్​ పూరి సహా మరి కొంతమంది నివాసాలపైనా ఐటీ శాఖ దాడులు చేసింది. సరైన లెక్కలు లేని రూ.281 కోట్లకు సంబంధించిన లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు అధికారులు.

భయంతోనే దాడులు: కమల్ నాథ్

దిల్లీ, భోపాల్, ఇండోర్​లో జరిగిన ఐటీ సోదాలపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్​నాథ్ స్పందించారు. ఎన్నికల్లో ఓడిపోతారన్న భయంతోనే భాజపా దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. ఈ విషయమై రాష్ట్ర కాంగ్రెస్ మీడియా విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది.

"దేశవ్యాప్తంగా విపక్షాలే లక్ష్యంగా భాజపా ప్రభుత్వం దాడులకు పాల్పడుతోంది. ఇదే విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ధర్నాలకు దిగారు. ఓటమి భయంతోనే భాజపా.. రాజ్యాంగ సంస్థలతో దాడులు చేయిస్తోంది."
-కమల్​నాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

చౌకీదార్​పైనే ఫిర్యాదులా?

"మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్​నాథ్ ప్రైవేట్ కార్యదర్శి ఇంట్లో సోదాలు చేస్తే కోట్ల రూపాయల నల్లధనం బయటపడింది. ఇదెలా ఉందంటే.. ఇంటిని కాపాడే కాపలాదారుపైనే దొంగ ఫిర్యాదు చేసినట్టుంది."
-కైలాశ్ విజయ వర్గీయ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి

ఎవరీ ప్రవీణ్ కక్కడ్​..?

మధ్యప్రదేశ్​కు చెందిన మాజీ పోలీసు అధికారి ప్రవీణ్ కక్కడ్​. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కమల్​నాథ్​ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కక్కడ్​ను ప్రత్యేక అధికారిగా నియమించారు. కేంద్ర మాజీ మంత్రి కాంతీలాల్​ భూరియా దగ్గర ఈయన ప్రత్యేక అధికారిగా ఉన్నారు.

ఎంతోమంది వ్యాపారులతో కక్కడ్​​ కుటుంబానికి సంబంధాలున్నాయి. రతుల్ పూరిని గతవారం ఈడీ అగస్టా వెస్ట్​ల్యాండ్​ కేసులో విచారించింది. లోక్​సభ ఎన్నికల ప్రకటన రాగానే కక్కడ్​​, మిగ్లానీ వారి ఉద్యోగాలకు రాజీనామా చేయడం గమనార్హం.

కోల్​కతాకు చెందిన వ్యాపారి పరాస్​ మార్​ లోథా నివాసాలపైనా దాడులు జరిగాయి. ఎన్నికల వేళ భారీగా హవాలా డబ్బు తరలిస్తున్నారనే సమాచారంతో ఈ సోదాలు చేశారు. సరైన ఆధారాలు లేని సొమ్మును స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++QUALITY AS INCOMING++
VALIDATED UGC - AP CLIENTS ONLY
++This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked by regional experts against known locations and events; confirmed locations
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by content creator who requested anonymity
Khartoum - 7 April 2019
1. Wide of protesters inside military headquarters compound
2. Wide of protesters inside military compound near out-of-commission airplane
3. Wide of protesters cheering as military members enter the compound, shouting (Arabic) "Freedom, freedom."
4. Mid of protesters marching and chanting (Arabic) "Just leave."
5. Close of protesters cheering, military members mixed in the crowd, chanting (Arabic) "Revolution, revolution."
6. Mid of protesters chanting (Arabic) "With our blood, our spirits, we'll defend the people."
7. Moving shot of protesters sitting within the military headquarters compound, improvised roadblocks
8. Wide of crowds chanting inside the military headquarters compound
STORYLINE
Sudanese security forces killed at least five protesters over the weekend during what organisers said were some of the largest demonstrations in a nearly four-month campaign to drive President Omar al-Bashir from power.
The protests, which began in December, have swelled since last week's resignation of Algeria's long-serving president in the face of similar rallies, giving new hope to Sudanese protesters aiming to end al-Bashir's nearly 30-year reign.
Security forces have responded with a fierce crackdown, killing at least 60 people since the protests began, according to Physicians for Human Rights, a New York-based rights group.
That figure does not include the latest deaths.
The government has said that 32 people have been killed, including police, but hasn't updated its tally in weeks.
The rallies are being led by the Sudanese Professionals Association, an umbrella group of independent professional unions.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 8, 2019, 9:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.