2025లో శుక్ర గ్రహంపై 'శుక్రయాన్-1' మిషన్‌ను ప్రయోగించనుంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో). ఈ మిషన్‌లో ఫ్రాన్స్ కూడా పాలుపంచుకోనుంది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ(సీఎన్ఈసీ) వెల్లడించింది.
ది విరాల్(వీనస్ ఇన్ఫ్రారెడ్ అట్మోస్ఫెరిక్ గ్యాస్ లింకర్) పరికరాన్ని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థతో కలిసి అభివృద్ధి చేసేందుకు ఫ్రాన్స్ జాతీయ పరిశోధన కేంద్రానికి(సీఎన్ఈఎస్) చెందిన లాట్మోస్ ల్యాబ్‌ను ఇస్రో ఎంపిక చేసినట్టు ఫ్రాన్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది.
అంతరిక్ష రంగంలో సహకారంపై ఇస్రో ఛైర్మన్ కే శివన్, సీఎన్ఈఎస్ అధ్యక్షుడు జీన్-యెస్ చర్చలు జరిపిన అనంతరం సంబంధిత విషయలను సమీక్షించారు.
"అంతరిక్ష పరిశోధనల్లో... శుక్ర గ్రహంపై ఇస్రో 2025లో ఓ మిషన్‌ను ఆవిష్కరించనుంది. ఇందుకోసం ఫ్రాన్స్ దేశం తన సహకారాన్ని అందించనుంది. తొలిసారిగా.. ఫ్రాన్స్ రూపొందించే పేలోడ్ భారత మిషన్‌లో ఉపయోగించనున్నారు."
--- సీఎన్ఈఎస్ ప్రకటన.
అయితే ఈ విషయంపై ఇస్రో నుంచి ఎలాంటి స్పందన లేదు.
2022 నాటికి ముగ్గురు భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే లక్ష్యంతో చేపట్టిన గగన్‌యాన్ ప్రాజెక్టులోనూ భారత్- ఫ్రాన్స్ కలిసి పనిచేస్తున్నాయి.
ఇదీ చూడండి:- శుక్ర గ్రహంపై ఆ వాయువు- జీవం ఉన్నట్లేనా?